వైయస్‌ జగన్‌ను కలిసిన‌ దివ్యాంగులు

విశాఖపట్నం: అర్హత ఉన్నా పెన్షన్‌ ఇవ్వడం లేదని దివ్యాంగులు వైయస్‌ జగన్‌ను కలిసి కన్నీరు పెట్టుకున్నారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం ఎస్సీకాలనీకి చెందిన దివ్యాంగులు అన్నపూర్ణ, శ్రీను పాదయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు. 1982లో ఎస్పీ కార్పొరేషన్‌ నుంచి పౌల్ట్రీఫాం ఇచ్చారని, ఇప్పుడు అది కూడా తీసేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తనకు సదరం తీసేసి పెన్షన్‌ కూడా ఇవ్వడం లేదని దివ్యాంగుడు శ్రీను వాపోయారు.  వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే మాలాంటి వారికి న్యాయం జరుగుతుందన్నారు. 
Back to Top