2019 ఎన్నికల్లో వైయస్సార్సీపీదే విజయం

చంద్ర‌బాబు మోసాల‌ను ప్ర‌జ‌లు గుర్తించారు
నంద్యాల‌: చ‌ంద్ర‌బాబు రెండున్నరేళ్ల పాల‌నలో ప్ర‌జ‌ల‌కు ఒరిగింది ఏమీ లేద‌ని, బాబు మోస‌పూరిత వాగ్దానాల‌ను ప్ర‌జ‌లు గుర్తించార‌ని నంద్యాల వైయ‌స్సార్‌సీపీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ మ‌లికిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్రమంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని పాండురంగాపురం గ్రామంలో ప‌ర్య‌టించారు. అనంత‌రం వంద‌ప్ర‌శ్న‌ల‌తో కూడిన ప్రజాబ్యాలెట్‌ను అంద‌జేసి బాబు మోస‌పూరిత పాల‌న‌ను ఎండగట్టారు.

సంక్షేమ ప‌థ‌కాల‌కు మంగ‌ళం
శ్రీ‌శైలం(బండిఆత్మ‌కూరు):  రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌కు మంగ‌ళం పాడి పేద‌ల‌ను విస్మ‌రిస్తోంద‌ని శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్సార్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త బుడ్డా శేషారెడ్డి మండిపడ్డారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న మండ‌ల ప‌రిధిలోని ప‌ర‌మ‌టూరులో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. బాబుకు ద‌మ్ము, ధైర్యం ఉంటే ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

చేనేత కార్మికుల‌పై చిన్న‌చూపు
తూర్పుగోదావ‌రి(మండ‌పేట‌):  నేత వృత్తిని న‌మ్ముకొని జీవిస్తున్న త‌మ జీవితాల్లో సంతోషం లేకుండా పోయింద‌ని నేల‌టూరు గ్రామానికి చెందిన చేనేత కార్మిక కుటుంబాలు ఆవేద‌న వ్య‌క్తం చేశాయి. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ వేగుళ్ల ప‌ట్టాభిరామ‌య్య చౌద‌రి ఆధ్వ‌ర్యంలో కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌జాసంక్షేమ‌ల ప‌థ‌కాల‌ను అంద‌రికీ అందాలంటే అది ఒక్క వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వ‌ల్లే సాధ్య‌మ‌న్నారు. 2019 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్‌సీపీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌లో విశేష స్పంద‌న‌
జ‌గ్గంపేట‌: నియోజక‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ ముత్యాల శ్రీ‌నివాస్ ఆధ్వ‌ర్యంలో గుర్ర‌ప్పాలెంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది.  ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు త‌మ గ్రామాల్లోని స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న దృష్టికి తీసుకొచ్చి ప్ర‌భుత్వ ప‌రంగా న్యాయం చేయాల‌ని కోరారు. అనంత‌రం శ్రీ‌నివాస్ మాట్లాడుతూ... చంద్ర‌బాబు మోస‌పూరిత హామీల గురించి ప్ర‌జాబ్యాలెట్ ద్వారా గ్రామ‌స్తుల‌కు వివ‌రించారు. 

తాజా ఫోటోలు

Back to Top