వైయ‌స్ఆర్ కుటుంబానికి విశేష ఆద‌ర‌ణ‌

భైరవపట్నం(మండవల్లి, మంగ‌ళ‌గిరి):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ``వైయ‌స్ఆర్ కుటుంబం`` కార్య‌క్ర‌మానికి రోజురోజుకు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఎంపీపీ సాకా జ‌సింత ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం భైర‌వ‌ప‌ట్నంలో చేప‌ట్టిన వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి  దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల‌ను గ‌డ‌ప గ‌డ‌ప‌లో వివ‌రించాల‌న్నారు. ప్ర‌తి ఇంటి నుంచి వారి ఫోన్లనుండి 9121091210 నంబరుకు మిస్డ్ కాల్ చేయించాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో కైకలూరు మండల పార్టీ అధ్యక్షుడు ముంగర నరశింహారావు, బోయిన నాగరాజు, వల్లూరి ఆదినారాయణ, గొంతుపులుగు మోషే త‌దిత‌రులు పాల్గొన్నారు. 
----------------
న‌వ‌ర‌త్నాలే న‌వ‌శ‌కానికి నాంది
గుంటూరు రూరల్: నవరత్నాలు నవశకానికి నాంది పలకనున్నాయని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు. మండలంలోని నల్లపాడులో వైయ‌స్ఆర్ సీపీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటప్పారెడ్డి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్ కుటుంబం సభ్యత్వ నమోదును బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖర‌రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. రాజధాని పేరుతో గాలి మేడలు పేపర్లపై చూపి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుగ్యోగ భతి, ఇంటికో ఉద్యోగం అంటూ యువతను నట్టేట ముంచారని విమర్శించారు. వారి శాపం తప్పకుండా తగులుతుందని చెప్పారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జిలాని, గ్రామ కన్వీనర్ దుగ్గెంపూడి యోగేశ్వర్రెడ్డి, యువజన విభాగం మండల కన్వీనర్ దుగ్గెంపూడి బాల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.....................................
వైయ‌స్ఆర్ కుటుంబం జ‌య‌ప్ర‌దం చేద్దాం
కారంపూడి : మండలంలో గురువారం నుంచి జరగనున్న ` వైయ‌స్ఆర్ కుటుంబం` కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా పార్టీ కార్యదర్శి చిరుమామిళ్ల శ్రీనివాసరావు, మండల యూత్ అధ్యక్షుడు చిలుకూరి చంద్రశేఖరరెడ్డి బుధవారం కోరారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల దాకా సభ్యత్వాలు తీసుకున్నారని, ఈ నెల 11 వరకు గడువును పొడిగించారని తెలిపారు. ఇక బూత్ స్థాయిలో ఇంటింటికి వెళ్లి ఎక్కువ మందిని వైయ‌స్ఆర్ కుటుంబంలో భాగస్వాములను చేయాలని వారు కోరారు.
-------------------------------
న‌వ‌ర‌త్నాలుతో ప్ర‌తి ఇంటికీ మేలు
* వైయ‌స్ఆర్‌సీపీ మండ‌ల క‌న్వీన‌ర్ స‌త్యం
ఓర్వకల్లు(అచ్చంపేట, మంగ‌ళ‌గిరి) :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప్ర‌తి ఇంటికీ మేలు చేకూర్చుతాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండ‌ల క‌న్వీన‌ర్ సందెపోగు స‌త్యం అన్నారు. మండలంలోని ఓర్వకల్లు, అంబడిపూడి గ్రామాలలో బుధ‌వారం ఆయన వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. నవరత్నాలుతో విద్యార్థులకు, మహిళలకు, రైతులకు, నిరుపేదలకు, వృద్ధులకు అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌న్నారు. జలయజ్జం ద్వారా రైతుల భూములకు సాగునీరు, కుటుంబ అప్యాయతల్ని పెంచేలా మూడు దశల్లో మ‌ద్య‌పాన నిషేదం, ఆరోగ్యశ్రీ ద్వారా మళ్లీ వైయ‌స్ఆర్ వైభ‌వం  వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. వృద్ధులకు, వితంతువులకు ఇస్తున్న వెయ్యి రూపాయల పెన్షను, రెండు వేలకు చేయనున్నట్లు చెప్పారు. ఓర్వకల్లులో 60మందిని, అంబడిపూడిలో 50మందిని వైయ‌స్ఆర్ కుటుంబంలో చేర్చారు. ఆయన వెంట మార్కెట్‌ యార్డు మాజీ డైరెక్టర్ అంబటి నారాయణ, జిల్లా పార్టీ సభ్యుడు సుంకర శ్రీనివాసరెడ్డి, ఓర్వకల్లు పార్టీ నాయకులు పూలగోపి, కోట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top