సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు

నాయుడుపేట టౌన్ః నగర పంచాయతీ పరిధిలోని సమస్యలను పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఎమ్మెల్యే సంజీవయ్యకు మొరపెట్టుకున్నారు. పట్టణంలో 19వ వార్డు పరిధిలో వైయస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ ఆధ్వర్యంలో సంజీవయ్య గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. రోడ్లు, వీధిలైట్లు తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్లు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్నామని వికలాంగులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Back to Top