ప్రజాసమస్యలపై వైయస్సార్సీపీ నిరంతర పోరు

ప్రకాశం(గిద్దలూరు):  స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో వైయ‌స్సార్‌సీపీ ఎప్పుడూ బాధితుల ప‌క్షాన పోరాడుతుంద‌ని గిద్దలూరు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ ఇల్లూరి వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి(ఐవీరెడ్డి) అన్నారు. కొమరోలు మండ‌ల ప‌రిధిలోని మిట్టమీదిపల్లి, ఎర్రపల్లి, మ‌ద‌వ‌ప‌ల్లి, గోనెప‌ల్లి గ్రామాల్లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ఎన్నిక‌ల స‌మ‌యంలో  చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు అమ‌లు చేసేవరకు వైయ‌స్సార్‌సీపీ నిరంత‌రం పోరాడుతుంద‌ని  స్ప‌ష్టం చేశారు. 

బాబు వ‌చ్చి పింఛ‌న్ తీసేశాడు
దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వంలో నాకు రూ. 200 పింఛ‌న్ వ‌చ్చేదీ. చంద్ర‌బాబు వ‌చ్చాక ఉన్న పింఛ‌న్ కూడా తీసేశాడు. అర్హ‌తున్నా ఎందుకు తీసేశారో తెలియ‌డం లేద‌ని మ‌ద‌వ‌ప‌ల్లి గ్రామానికి చెందిన ల‌క్ష్మ‌మ్మ ఐవీరెడ్డి ఎదుట వాపోయింది. 

విశాఖ‌ప‌ట్నం: ఏ గ‌డ‌ప‌కూ వెళ్లిన ఒకే నినాదం బాబు మోసం చేశాడ‌ని... ఏ మ‌నిషిని ప‌ల‌కరించిన ఒకే మాట చంద్ర‌బాబుకు జీవితంలో ఓటు వేయమని చెబుతున్నారు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు ఎంత‌వ‌రకు అమ‌లు జ‌రిగాయో తెలుసుకునేందుకు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కార్య‌క్ర‌మాన్ని అన‌కాప‌ల్లిలో పార్టీ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్నాథ్ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగింది.  ఈ కార్య‌క్ర‌మంలో జాన‌కిరామ‌రాజు, బాబు, శ్రీ‌నివాస్‌, సూరిబాబు, ర‌మేష్, జ‌గ‌న్‌, త్రినాథ్ త‌దిత‌రులున్నారు. 

Back to Top