బాబు పాలనంతా అవినీతిమయం

పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన అంతా అవినీతిమయంగా తయారైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. పోలవరం మండలం గోండ్రుకోట, వాడపల్లి గ్రామాల్లో బాలరాజు ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామాల ప్రజలతో చంద్రబాబు మూడేళ్ల అరాచక, దోపిడీ పరిపాలనను వివరించారు. ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన దొంగ హామీలపై ప్రచురించిన ప్రజాబ్యాలెట్‌ను ఆయన ప్రజలకు అందించి మార్కులు వేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ సుంకా వెంకట్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top