రాజమండ్రిలో పండుగ వాతావరణం

అన్న రాకకోసం వేచిచూస్తున్న జనసంద్రం
‘తూర్పు’స్వాగతం చరిత్రలో నిలిపోతుంది 
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా సంకల్పయాత్ర పండుగ నెలకొంది. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టనున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లక్ష మందికిపైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌ సీపీ నేత జక్కంపూడి రాజా అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్రతో చంద్రబాబు దుర్మార్గపు పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి భరోసా ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత జనం మెచ్చిన పాలన అందించారన్నారు. అదే విధంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేత నిర్ణయంతో మూడువేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. మరోసారి చంద్రబాబు పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పాదయాత్రగా వచ్చి చూస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న వైయస్‌ జగన్‌కు మరుపురాని సంఘటనగా నిలిచిపోయేలా రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై ఘనస్వాగతం పలుకుతామన్నారు. లక్ష మందికి పైగా వైయస్‌ జగన్‌ అడుగులో అడుగు వేయనున్నారన్నారు. 
 
Back to Top