అవినీతి లేని పాలన అందిస్తాం: వైయస్‌ జగన్

హైదరాబాద్ :

‘అవినీతి గురించి అందరూ మాట్లాడుతున్నారు.. కానీ అవినీతి రహిత పాలన ఎలా ఉండాలో చెప్పడం లేదు. అందుకే మేం చేసే పాలనను అత్యంత పారదర్శకంగా ఉంచుతాం. ఎవరూ వేలెత్తి చూపించకుండా వ్యవస్థల్లో మార్పులు తీసుకువస్తాం. ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు, పనులు చేసిన తరువాత వాటిని ‘కాగ్’ లాంటి సంస్థలు తప్పుపట్టడం కనిపిస్తోంది. కానీ.. మా ప్రభుత్వమే హైకోర్టు వద్దకు, కాగ్ వద్దకు వెళ్లి ఫైళ్లు చూపించేలా చేస్తాం.. మా ఆలోచనలు, ప్రణాళికలు వివరిస్తాం. సలహాలు, సూచనలు అందించమంటాం. ఏం చేస్తే బావుంటుందో చెప్పమంటాం. ఒక కాల పరిమితి ప్రకారం (టైం బౌండ్) సూచనలు కోరుతూ ఫై‌ల్‌ను డిస్పోజ్ చేయమంటాం‌' అని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.

టెండర్ల ప్రక్రియ కూడా అదే పద్ధతిలో సాగుతుందని శ్రీ జగన్‌ తెలిపారు. 'ఒక్కసారి ఫైళ్ళకు అనుమతి ఇచ్చాక మాత్రం వాటిని తప్పుపట్టొద్దని చెప్తాం. తరువాత ‘ఈనాడు’ వంటి పత్రికలు వాటిని వక్రీకరించి వార్తలు రాస్తే కోర్టు ధిక్కారం కింద జైల్లో పెట్టమంటాం. ఏం చేసినా ఈనాడు బండలేస్తోంది.. ఏ మంచి పని చేసినా తప్పేనంటోంది. అయినా చాలెంజ్.. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఉంటుంది’‌ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

Back to Top