వైయస్‌ఆర్‌లా ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?


నీతిమాలిన ప్రకటన చేయడం మానుకో చంద్రబాబూ?
1500ల రోజుల పాలన విజయాల ప్రకటనలు విడ్డూరం
బాబు ప్రకటనలో అన్ని అబూతకల్పనలు, అవాస్తవాలే
అన్నపూర్ణ ఆంధ్రను బస్మంతో పోల్చడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం
రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు.. 30 లక్షల ఉద్యోగాలు ఏవీ.
కేంద్రంతో లాలూచీ రాజకీయాలు చేస్తే దొంగ దీక్షలు
అసలు పోలవరంలో చంద్రబాబు పాత్ర ఏంటీ?
పోలవరం వైయస్‌ఆర్‌ కలల స్వప్నం
విజయవాడ: చంద్రబాబుకు దమ్ముంటే 1500ల రోజుల్లో సాధించిన విజయాలతో 2019 ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి సవాలు విసిరారు. 1500ల రోజుల పాలన అని గొప్పలు చెప్పుకోవడం.. ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రకటనలు, లెక్కలు ఎక్కడా వాస్తవం లేదన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తన ఐదు సంవత్సరాల పాలన చూసి ఓట్లు వేయండి అని 2009లో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారన్నారు. అలా వెళ్లే దమ్మూ, ధైర్యం చంద్రబాబులో ఉన్నాయా అని నిలదీశారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను బస్మంతో పోల్చడం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు ప్రకటనలను వైయస్‌ఆర్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ మేరకు విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడగొట్టిన పాపంలో చంద్రబాబుది ప్రధాన పాత్ర అని, విభజనకు మద్దతు తెలుపుతూ యూపీఏ ప్రభుత్వానికి లేఖ రాశాడని గుర్తు చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన పరిపాలనలో పూర్తిగా రాష్ట్రాన్ని దిగజార్చి సూర్యాస్తమయ ఏపీగా మార్చడని ధ్వజమెత్తారు. 

ప్రజల చెవ్వుల్లో పూలు పెట్టడం చంద్రబాబు నుంచి మంత్రుల వరకు బాగా వంటపట్టిందని పార్థసారధి విమర్శించారు. రూ. 16.04 లక్షల కోట్ల పెట్టుబడులకు అగ్రిమెంట్లు చేసుకున్నారంట.. దాంట్లో రూ. 1.48 కోట్ల వచ్చినట్లుగా చంద్రబాబు, ఇప్పటికే రూ.8 లక్షల కోట్లు వచ్చినట్లుగా ఆర్థికమంత్రి యనమల చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. టీడీపీలో నంబర్‌గా చలామనీ అవుతున్న లోకేష్‌ రూ. 5 లక్షల కోట్లు వచ్చాయంటున్నారని, ఎవరి మాటలు నమ్మాలో ప్రజలకే అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కేంద్రానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ ప్రయోషన్‌ పాలసీ (డీఐపీపీ) అనుమతులు ఇవ్వాలన్నారు. డీఐసీపీ లెక్కల ప్రకారం వాస్తవానికి రాష్ట్రానికి కేవలం రూ. 25 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు. 16 లక్షల పెట్టుబడులు, 30లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి చంద్రబాబూ అని ప్రశ్నించారు. 

విశాఖ– చెన్నై పారిశ్రామిక కారిడార్‌ స్థాపన చేశారని చంద్రబాబు మరో గొప్ప అబద్ధం చెప్పాలరని, కారిడాకర్‌కు చంద్రబాబు.. కేంద్రమంత్రి ఎవరైనా కొబ్బరికాయ అయినా కొట్టారా అని ప్రశ్నించారు. కారిడార్‌ అనుమతుల కోసం వైయస్‌ఆర్‌ సీపీ పోరాడుతుంటే.. వచ్చేసిందని అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. కేంద్రంతో లాలూచీపడి ప్రజల కోసం దొంగ దీక్షలు.. రికార్డులపరంగా అన్ని చేసేసిందని దొంగ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నుంచి టీడీపీ నేతలంతా మోడీ అన్యాయం చేశారు.. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చలేదని దొంగ దీక్షలు, దొంగ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన అంశాలపై మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైయస్‌ఆర్‌ సీపీ ఒక్కటేనని గుర్తు చేశారు. 

పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏంటని కొలుసు పార్థసారధి ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ తయారు చేసిన 7.2 లక్షల ఎకరాల ఆయకట్టు, 30 లక్షల ఆయకట్టు స్థిరీకరణ దీనికి మించి రాష్ట్రానికి అధనంగా చంద్రబాబు ఏమైనా లాభం చేకూర్చాడా అని నిలదీశారు. వైయస్‌ఆర్‌ చొరవ వల్లే పోలవరం ప్రాణం పోసుకుందని, చంద్రబాబు తన అవినీతి కోసం పోలవరం ఊపిరి తీస్తున్నాడని ధ్వజమెత్తారు. కనీసం 40 శాతం పనులు పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్‌ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నానని ప్రకటించుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇంకా కాఫర్‌ డ్యాం, ఎర్తండ్‌ డ్యామ్, అనేక ముఖ్యమైన పనులు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, కేంద్రం నుంచి పూర్తి అనుమతులు, నిధులు కేటాయించబడలేదు. కానీ ప్రాజెక్టును మాత్రం జాతికి అంకితం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు. నేనే పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చానని గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబు చేతగానితనానికి నిదర్శనమన్నారు. ప్రాజెక్టు అంచెనాలు పెంచి ఇష్టారీతిగా డీపీఆర్‌లను పెంచి డబ్బులు దండుకోవడం తప్ప మరొకటి లేదన్నారు. 

డ్వాక్రా మహిళలకు పసుపు, కుంకుమ కింద ఇస్తున్న రూ. 10 వేలలో కూడా చంద్రబాబు కుట్రలు చేశాడని పార్థసారధి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన రోజున డ్వాక్రా మహిళలకు రూ. 15 వేల కోట్ల అప్పులున్నాయన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి వారంతా అప్పులు కట్టకపోవడంతో 12 శాతం వడ్డీ లెక్కన అవి దాదాపు నాలుగేళ్లలో రూ. 7 నుంచి 8 వేల కోట్ల అప్పుభారం పెరిగిందన్నారు. గతంలో వైయస్‌ఆర్‌ ఇచ్చిన వడ్డీ రాయితీలను ఎగ్గొట్టి దాన్ని ఇంకో రూపంలో రుణమాపీ అని చెప్పి పసుపు, కుంకుమ పేరుతో మరో మోసం చేస్తున్నావా..? చంద్రబాబు అని నిలదీశారు. రైతు రుణమాపీ రూ. 24 వేల కోట్లు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని, రూ. 87 వేల కోట్ల అప్పు ఉంటే.. వాస్తవానికి చంద్రబాబు రూ. 15 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారన్నారు. ఆఖరి బడ్జెట్‌లోనైనా రైతు రుణమాఫీకి ఎంత కేటాయిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రూ. 7 వందల కోట్లతో ఆదరణ పథకం చేపట్టానని, 5 లక్షల మందికి పనిముట్లు ఇచ్చానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రెండున్నర కోట్లు ఉన్న బీసీలకు రూ. 750 కోట్లు ఇచ్చానని చెప్పుకోవడానికి సిగ్గులేదా.. బలహీనవర్గాల ప్రేమ ఇదేనా అని విరుచుకుపడ్డారు. 
Back to Top