చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్థం

– రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది
– వైయస్సార్‌ సిపి మండల కన్వినర్‌ సత్యం

అచ్చంపేట (గుంటూరు): రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, సీయం చంద్రబాబు కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని, అక్రమాలు, దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వైయస్సార్‌ సిపి మండల కన్వినర్‌ సందెపోగు సత్యం అన్నారు. ఇందుకు నిరసనగా స్థానిక వైయస్సార్‌ విగ్రహ సెంటర్‌లో శనివారం వైయస్సార్‌ సిపి మండల యూత్‌ కన్వినర్‌ గోపు అంతోని రెడ్డి ఆధ్వర్యంలో సీయం చంద్రబాబు దిష్టబొమ్మను పార్టీ కార్యకర్తలు దగ్థం చేశారు. సీయం డౌన్‌డౌన్, అవినీతి సామ్రాట్‌ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.    నంద్యాల ఉప ఎన్నికలలో చంద్రబాబు నాయుడు విచ్చలవిడి తనంతో  వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా సత్యం ఆరోపించారు.  జగన్‌ సభకు వచ్చిన జనప్రవాహాన్ని చూసి ఓర్వలేక ఏదో కుంటి సాకులు చెబుతూ తన అనుకూల  మీడియా ద్వారా ప్రజలను తప్పుదోప పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  వైఎస్సార్‌ సిపి అధినాయకుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అన్నదాంట్లో తప్పేమి లేదన్నారు. మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్‌ సీహెచ్‌ ఎస్సార్కే సాయిరెడ్డి మాట్లాడుతూ మూడేళ్లుగా అధికారంలో ఉంటూ ఏ ఒక్క హామీ అమలుచేయని వ్యక్తిని అనైతిక రాజకీయలకు పాల్పడుతున్హ్న వ్యక్తిని ఏం చేసినా తప్పులేదని అన్న జగన్‌ మాటలకు టీడీపీ నేతలు ఎందుకు భుజాలు తముడుకుంటున్నారో అర్థం కావడంలేదన్నారు. ఆ మాటలు చంద్రబాబుకు వర్తిసాయని పరోక్షంగా టీడిపీ మంత్రలు, ఎమ్మెల్యేలు ఒప్పుకుంటున్నట్లేకదా అని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తుమ్మా చిన్నపరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ డైరెక్టరు అంబటి నారాయణ, జిల్లా పార్టీ సభ్యుడు సుంకర శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ ప్రధానకార్యదర్శి అనుముల సాంబిరెడ్డి, తుమ్మా మర్రెడ్డి, జెసిబి మర్రెడి, గాదె ఇన్నారెడ్డి, టౌన్‌పార్టీ కన్వినర్‌ షేక్‌ మౌలాలి, మాజీ ఎంపీటీసీ చిల్కా వెంకట్రావు, టౌన్‌పార్టీ యూత్‌ కన్వినర్‌ చల్లా శ్రీకాంత్, పరిమిగురున్నాధం, నాగులు,ఈమని బ్రహ్మారెడ్డి, ఇమ్మానియేలు, కృష్ణబాబు, అనంతరామయ్య, ప్రతాప్‌ రెడ్డి, కాండ్రు ఎలియాస్, చింతపల్లి బాలస్వామి, రాజారెడ్డి, కన్నెగంటి చిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top