విజయవాడః పార్టీ నేతల కోలాహాలం మధ్య వైయస్సార్సీపీ రాష్ట్ర నూతన కార్యాలయం ప్రారంభమైంది. విజయవాడ బందర్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. స్వరాజ్య మైదానం సమీపంలోని కేపీ రెడ్డయ్యప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ సీనియర్ నేతలు పెద్దిరామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్రోక్తకంగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.