మహానేత మీరే స్ఫూర్తి..ఆశీర్వ‌దించండి

- దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాదాల వద్ద ఎంపీల రాజీనామా పత్రాలు..
- రాజీనామాల‌కు సిద్ధ‌మైన వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు
- కాసేప‌ట్లో పార్ల‌మెంట్‌కు  వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు
   
 
న్యూఢిల్లీ:  రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది.పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని కోరుతూ అదే పార్ల‌మెంట్ వేదిక‌గా పోరాటానికి శ్రీ‌కారం చుట్టారు. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా మార్చి5వ తేదీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఆందోళ‌న చేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై ఏకంగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. అయినా కేంద్రం చ‌ర్చ‌కు అనుమ‌తించ కుండా పారిపోవ‌డంతో ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధ‌ప‌డ్డారు. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీలో చాటిచెప్పిన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్ఫూర్తిగా పార్టీ ఎంపీలు ప‌ద‌వులు త్యాజించేందుకు ముందుకు వ‌చ్చారు. ఈ మేర‌కు త‌మ రాజీనామా ప‌త్రాల‌ను మ‌హానేత పాదాల వ‌ద్ద ఉంచి ఆశీర్వాదం పొందారు. 

నేడు రాజీనామాలు
 ప్రత్యేక హోదా పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి.. పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం సాగించి.. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించి.. దేశవ్యాప్తంగా చర్చనీయాం శంగా మార్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేడు అంతిమ పోరాటాన్ని ప్రారంభించింది. హోదా సాధన పోరాటంలో భాగంగా నేడు పదవులకు రాజీనామాలు చేయనున్న ఎంపీలు.. సంతకాలు చేసిన రాజీనామా పత్రాలను మహానేత వైయ‌స్ఆర్‌ పాదాల వద్ద ఉంచి, నమస్కరించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన శుక్రవారం సభ నిరవధిక వాయిదా ప్రకటన వెలువడగానే రాజీనామాలు సమర్పిస్తామని  ఎంపీలు తెలిపారు. ఆ వెంటనే ఏపీ భవన్‌ వేదికగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు.

ఢిల్లీలో దీక్షకు దిగనున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్లా సంఘీభావ దీక్షలు జరుగనున్నాయి. పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ మేరకు విద్యార్థులు, యువతకు ఇదివరకే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అటు ఎంపీల దీక్షా శిబిరానికి కార్యకర్తల తాకిడి మొదలైంది. వేలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా ఢిల్లీకి పయనం అయ్యారు.


తాజా వీడియోలు

Back to Top