హోదా కోసం అందరం రాజీనామాలు చేద్దాం

ఢిల్లీ: తెలుగు వారి ఆత్మ గౌర వం కోసం నినదించాల్సిన సమయం ఇదని, ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి ఎంపీ పదవులకు రాజీనామా చేద్దామని ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. ఢిల్లీలో తలపెట్టిన మహాధర్నాలో ఎంపీ వరప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక హŸదా సాధనకు టీడీపీ ఎంపీలు కూడా మాతో ఏకీభవించి పోరాటం చేయాలని కోరారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఒత్తిడి తెద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం నిధులు గ్రాంట్‌గా, అలాగే నిధుల్లో 30 శాతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇస్తారన్నారు. ఇప్పటికే నాలుగేళ్ల సమయం వృథా అయ్యిందని, ప్యాకేజీతో ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలు, ప్రోత్సాహకాలు వస్తాయని, దీని వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. హోదా ఉన్న రాష్ట్రాల్లో రుణాల చెల్లింపుల్లోనూ సౌలభ్యం ఉంటుందని చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఆయన నినదించారు.
 

తాజా ఫోటోలు

Back to Top