హోదాను తాకట్టుపెట్టే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది

ఇవాల్టికి హోదా హామీ రాకపోవడం దురదృష్టకరం
భావితరాల కోసం రాజీనామాలు చేస్తున్నందుకు గర్వంగా ఉంది
వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి ఇవాల్టికి స్పష్టమైన హామీ రాకపోవడం దురదృష్టకరమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీని అంగీకరించే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమం జరుగుతుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు 5వ తేదీన ఢిల్లీలో ధర్నా చేయనున్నామని, అదే విధంగా మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు అన్ని మార్గాల్లో నిరసనలు తెలుపుతామన్నారు. ఏప్రిల్‌ 6వ తేదీన వైయస్‌ జగన్‌ సూచనల మేరకు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం రాజీనామాలు చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. 
40 ఏళ్ల అనుభవం నాలుగేళ్లుగా ఏం చేసింది: ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
ప్రతిపక్ష పార్టీ ప్రజల తరుపున పోరాడుతున్నా.. ప్రభుత్వానికి గిట్టడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకోవడం తప్ప నాలుగేళ్లగా చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. హోదా విషయంలో చంద్రబాబు ప్రజలను తప్పుదోవపట్టించేందుకు కుట్రలు చేస్తున్నాడన్నారు. 
నాలుగేళ్లుగా అనేక పోరాటాలు: ఎమ్మెల్యే కొరుమట్లు శ్రీనివాసులు
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుఅని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. హోదా కోసం వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ నేతృత్వంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నాలుగేళ్లుగా అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు. కేంద్రం మెడలు వంచి తీరుతాం. హోదా కలిగిన రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో.. హోదా వస్తే ఆంధ్రరాష్ట్ర కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. 
ఊసరవెళ్లి సిగ్గుపడేలా చంద్రబాబు వైఖరి: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
ప్రత్యేక హోదా ఉద్యమంలో రాజకీయ పార్టీలన్నీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రావాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో హోదాను 15 సంవత్సరాలు సాధిస్తామని వాగ్దానం చేసినం చంద్రబాబు నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. ఊసరవెళ్లి సిగ్గుపడేలా చంద్రబాబు వైఖరి ఉందన్నారు. రాష్ట్ర దారునమైన స్థితిలో ఉందని, ఇలాంటి పరిస్థితిలో ప్రత్యేక హోదా అవసరమన్నారు. వైయస్‌ జగన్‌ వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. 
 
Back to Top