ఓటు హ‌క్కును వినియోగించుకున్న ఎమ్మెల్యేలు

నెల్లూరుః ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్దన్‌రెడ్డి, ఆయ‌న కూతురు పూజితారెడ్డిలు పొద‌ల‌కూరు జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అదే విధంగా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శివ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. 

Back to Top