బాబు కళ్లులేని కబోదుడా?

విజయవాడ: రాజధాని నడిబొడ్డున అధికారులపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లులేని కబోదుడిలా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ కంచె చేనును మేసినట్లుగా ప్రభుత్వమే తన అధికారులపై దాడులకు దిగడం దుర్మార్గమన్నారు. గత మూడేళ్లుగా ఎంతో మంది అధికారులపై దాడులకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. బోండా ఉమా అసెంబ్లీలో సశ్చీలుడిగా వ్యవహరిస్తూ తన గుండాయిజాన్ని విజయవాడ నడిబొడ్డున చూపించారన్నారు. టీడీపీ పాలన చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక రౌడీ రాజ్యంలో ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. చంద్రబాబు సర్కార్‌ చేసే దాష్టికాలకు రాబోయే కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Back to Top