సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి నీచ రాజకీయాలు

హైదరాబాద్, 28 సెప్టెంబర్‌ 2013:

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యే‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. పదవీకాలం ముగిసిపోతున్న తరుణంలో త్యాగాలు చేస్తానంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించడమేమిటని ఆయన విమర్శించారు. ‌ఆంధ్రప్రదేశ్‌ విభజనపై సిఎం కిరణ్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్‌రెడ్డి ఈ విధంగా స్పందించారు.

కేవలం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే ముఖ్యమంత్రి కిరణ్‌ అలా మాట్లాడారని శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ‌ఛిన్నాభిన్నం అవడానికి యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. అసెంబ్లీని సమావేశపరిచి, రాష్ట్రాన్న సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేయాలని శ్రీకాంత్‌రెడ్డి ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top