రాష్ట్ర అభివృద్ధి జననేతతోనే సాధ్యం

ప్రజల్లో ఆ నమ్మకం ధృడంగా నాటుకుపోయింది
వైయస్‌ జగన్‌ సీఎం అయితే ప్రతీ పేదవాడికి మేలు
విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ప్రజల్లో ధృడంగా నాటుకుపోయిందని, దాన్ని ఎవరూ చెరపలేరని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. ప్రతీ పేదవాడికి అండగా ఉండాలని, సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే లక్ష్యంతో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ముందుకుసాగుతున్నారన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పాదయాత్ర చేస్తున్న జననేతకు మద్దతుగా ప్రజలంతా ఆయన అడుగులో అడుగులు వేస్తున్నారన్నారు. మహిళలు పెద్ద ఎత్తున వైయస్‌ జగన్‌కు హారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారన్నారు. మాడుగుల నియోజకవర్గం కొత్తపెంట నుంచి 253వ రోజు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించిన వైయస్‌ జగన్‌ కే.కోటపాడులో భారీ బహిరంగసభలో పాల్గొంటారన్నారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రస్తావిస్తూ.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారో చెబుతారన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని, వైయస్‌ఆర్‌ పరిపాలన అందరూ చూడాలని కోరుకుంటున్నారన్నారు. జననేత ముఖ్యమంత్రి అయితే ప్రతీ పేదవాడికి, ప్రతీ విద్యార్థికి మేలు జరుగుతుందన్నారు. 

ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం 2011లో వైయస్‌ఆర్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు చేయడం జరిగిందని ఫెడరేషన్‌ సభ్యులు చెప్పారు. అప్పటి నుంచి వైయస్‌ఆర్‌ ఆశయాలకు అనుగునంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో విద్యావ్యవస్థ దారుణంగా ఉందన్నారు. అది మెరుగుపడాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించని దౌర్భాగ్య ప్రభుత్వం చంద్రబాబుదన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగునంగా ఉపాధ్యాయులను నియమించకుండా పాఠశాలలను మూసివేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. గిరిజన ప్రాంత పేద విద్యార్థులకు విద్యను దూరం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. వెంటనే పాఠశాలలు తెరిపించి.. గిరిజన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 
  
Back to Top