వైయ‌స్‌ జగన్‌ అంటే ఐదు కోట్ల మంది గుండె చప్పుడు విశాఖపట్నం : వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అంటే ఐదు కోట్ల మంది గుండె చప్పుడు అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు. విశాఖ వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌లో  ఆయ‌న మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై వైయ‌స్ జ‌గ‌న్‌ దీక్షాదక్షత చూసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భయం పట్టుకుందన్నారు. అందుకే సీఎం దొంగ నాటకాలు, దీక్షలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను చేసిన అవినీతికి శ్రీకృష్ణుడి జన్మస్థానానికి వెళ్తాననే భయం చంద్రబాబులో ఉందని,  అందుకే అందరూ తనకు కాపలా ఉండాలని ప్రజలను అడుగుతున్నారంటూ అనిల్‌ ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతి అందరికి తెలిసిపోయిందని, జైల్లో కూర్చోపెట్టే దాకా ప్రజలు ఎవరూ నిద్ర కూడా పోరని వ్యాఖ్యానించారు.  నాడు కాంగ్రెస్‌తో కుట్రపన్ని వైయ‌స్‌ జగన్‌పై అక్రమ కేసులు బనాయించారని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు.   

Back to Top