వైఎస్ కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల నివాళి


హైదరాబాద్, సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మంగళవార శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ముందు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యేలందరూ పార్టీ కేంద్ర కార్యాలయంలో కలుసుకున్నారు. 'వైఎస్సార్ అమర్ హై', 'జై జగన్' అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి వాహనాల్లో బయలుదేరి పంజాగుట్ట వద్ద గల వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి పూలు జల్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ఎమ్మెల్యేలు పేద, బడుగు వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి అమలు చేసిన ఘనత వైఎస్ దేనని కొనియాడారు. ఆయన లేని లోటు ఇప్పుడు తెలుగు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

అసెంబ్లీ సెంట్రల్ హాలులో...
పంజాగుట్ట నుంచి శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యేలు సెంట్రల్ హాలులోని వైఎస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్ అమర్ హా అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పన, ఆదిమూలం సురేష్, కిడారు సర్వేశ్వరరావు, మణిగాంధీ, కళత్తూరు నారాయణ స్వామి, బూడి ముత్యాలనాయుడు, వరుపుల సుబ్బారావు, పాలపర్తి డేవిడ్ రాజు, షేక్ బేపారి అంజాద్ బాష, పి అనిల్ కుమార్ యాజవ్, తిరువీధి జయరామయ్య, మేకా ప్రతాప అప్పారావు, కొరుముట్ల శ్రీనివాసులు, గమ్మనూరు జయరాం, షేక్ ముస్తఫా, కొడాలి నాని, గొట్టిపాటి రవి కుమారు, వై విశ్వేశ్వర రెడ్డి, జంకె వెంకటరెడ్డి, పిన్నెల్లి రామకృష్టా రెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, గౌరు చరితా రెడ్డి, విశ్వాసరాయ కళావతి, గిడ్డి ఈశ్వరి, ఐజయ్య, వంతెల రాజేశ్వరి, ఆర్ కె రోజా, సి ఆదినారాయణ రెడ్డి, కంబాల జోగులు, కలమట వెంకట రమణ, కొక్కిలిగడ్డ రక్షణనిధి, రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి, వై సాయిప్రసాద్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వై బాలనాగి రెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, సి నారాయణ రెడ్డి, మేకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

Back to Top