ఆముదాల వలసలో వైయస్‌ఆర్‌సీపీ భారీ ర్యాలీ..

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నంపై  తక్షణమే సిబిఐతో విచారణ చేయించాలని వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం డిమాండ్‌ చేశారు.ఘటనపై చంద్రబాబు,డీజీపీ ఠాకూర్‌ వ్యాఖ్యలను ఖండించారు. తమ్మినేని ఆ«ధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీఎస్‌ఆర్‌ కళాశాల నుంచి రైల్వేస్టేషన్‌ కూడలి వరుకు సాగింది. ఈ ర్యాలీలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 
Back to Top