చింతమనేని దాదాగిరి.. వైయస్సార్సీపీ నేతల ఆగ్రహం

ఏలూరుః దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి  తన దాష్టీకాన్ని ప్రదర్శించారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడి ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారు. ఇదేమని ప్రశ్నించిన మహిళలను ఆయన అనుచరులు నోటికొచ్చినట్టు దూషించారు. ఏలూరు మండలం దెందులూరు నియోజకవర్గంలోని మల్కాపురంలో  తన అనుచరులతో తిరుగుతూ...  వైయస్సార్సీపీ నేత తూతా నిరంజన్‌ ఇంటికి చేరుకున్నారు. నిరంజన్‌ ఇంటి వెనుక భాగంలో ప్రహరీగోడకు పశువులను కట్టేందుకు ఏర్పాటు చేసుకున్న ఇనుప కొంకాలను పీకించారు. ప్రభాకర్‌ వెనక భాగం నుంచి ఇంట్లోకి ప్రవేశించి మహిళలను తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు.  

కుళాయికి ఏర్పాటు చేసిన మోటార్‌ విద్యుత్‌ వైర్లను కట్‌ చేయించారు. అధికార బలంతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గం కన్వీనర్‌ కొఠారు రామచంద్రరావు చింతమనేని ప్రభాకర్‌ను హెచ్చరించారు. సోమవారం మల్కాపురంలో నిరంజన్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.

తాజా ఫోటోలు

Back to Top