బోడె ప్రసాద్‌పై కేసు న‌మోదు చేయాలి

సాక్షి, విజయవాడ : వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు న‌మోదు చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు డిమాండు చేశారు. శ‌నివారం కంకిపాడు పీఎస్‌లో బోడె ప్రసాద్‌పై ఫిర్యాదు చేసేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, అడ్వకేట్లు వెళ్లారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోకుడా.. ఇది కంకిపాడు పీఎస్‌కు రాదని.. పెనమలురు పీఎస్‌కు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో నాయకులు పెనమలూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు అక్కడి వెళ్లి గంటలపాటు పడిగాపులు కాశారు. కొన్ని గంటలపాటు పీఎస్‌లోనే ఉన్నారు. అయినా కూడా ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఆందోళ‌న చేప‌ట్టారు. ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు. 

Back to Top