అన్నపూర్ణ ఆంధ్రను దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్‌గా మార్చాడు

చంద్రబాబు ఏం మేలు చేశాడని అడిగితే గంట ఆలోచిస్తున్నారు
అదే అన్యాయం గురించి అడిగితే రైతులకు సమయం సరిపోవడం లేదు
కరువు మండలాలను ఆదుకునేందుకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా?
ప్రత్యేక విమానాల ఖర్చు రైతులకు ఇస్తే వ్యవసాయం బాగుపడేది
ఆక్వా రైతులకు రూ. 2 సబ్సిడీ ఇస్తానని ప్రకటించి వంచన
చంద్రబాబుకు దమ్ముంటే పోలవరం దోపిడీ అందరికీ చూపించాలి
హైదరాబాద్‌: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ చంద్రబాబు పాలనలో దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్‌గా మారిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రైతులకు ఏం చేశారని రైతులను అడిగితే గంట ఆలోచించినా నాలుగు లైన్లు కూడా రాయలేసి పరిస్థితి ఉందని, అదే బాబు చేసిన అన్యాయం గురించి రాయమంటే సమయం సరిపోని పరిస్థితి ఉందన్నారు. నాలుగున్నరేళ్లలో రెండంకెల వృద్ధి రేటు సాధించానని గొప్పలు చెప్పుకోవడం తప్పితే రైతులకు చేసిందేమీ లేదన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. దేశ వ్యాప్తంగా సాగు 10 వందల 58 లక్షల హెక్టార్లలో సాగు జరగాలి. కానీ 10 వందల 57.81 సాగు జరిగింది. దేశ వ్యాప్తంగా సాగు బాగుంది. ఆహార ధాన్యాల దిగుబడి రికార్డులో ఉంటుందని చెబుతున్నాయి. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఖరీఫ్‌లో 43.86 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 2014–15లో 39.86 లక్షల ఎకరాలకు, 2015–16లో 36.34 ఎకరాలకు, 2017–18లో 35.09 లక్షలకు సాగు పడిపోయింది. చంద్రబాబు ఎప్పుడూ నా రికార్డులను నేనే బ్రేక్‌ చేస్తానంటాడు.  ఆయన కరువు రికార్డు ఆయనే బ్రేక్‌ చేసుకున్నాడు. గత సంవత్సరం 33.29 లక్షల హెక్టార్లు, దీంట్లో 13.10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 13 వందల కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడానికి కావాలని ప్రభుత్వమే ప్రకటించింది. 

రాష్ట్రంలో 394 కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వ అనుకూల మీడియాలోనే వచ్చింది. కానీ 275 మండలాలు ఒకసారి, 21 మండలాలు తరువాత ప్రభుత్వం డిక్టెర్డ్‌ చేసింది. కర్నూలు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు మొత్తం మండలాలను కరువు మండలాలుగా డిక్టెర్డ్‌ చేయాలని లేఖలు రాశారు. గుంటూరులో 14, విశాఖలో 10, విజయనగరం 12, శ్రీకాకుళం 14 మండలాలు ఇంకా కరువు మండలాలుగా ప్రకటించాల్సి ఉంది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 336 మండలాలు తీవ్ర దుర్భిక్షంలోకి వెళ్లిపోయాయి. ప్రజలు వలసలు వెళ్తున్నారు. గ్రాసం లేక పశువులు కబేళాకు వెళ్తున్నాయి. క్షేత్రస్థాయిలో దుర్భిక్ష పరిస్థితి ఉంటే రెయిన్‌ గన్‌లతో కరువు జయించాను అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కర్నూలులో మొత్తం మండలాలను కరువు మండలాలుగా డిక్టెర్డ్‌ చేయాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అధికారులను నిలదీశారు. కడప మొత్తం కరువు మండలాలే.. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఒక్క మండలం తప్ప అన్ని మండలాలు కరువు మండలాలు, ఇన్ని కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం వారికి ఏమైనా ఒక్కరూపాయి సాయం అందించిందా? 

ఇలాంటి కరువులో మొదట మార్కెట్‌కు వచ్చింది ఉల్లి పంట. ఉల్లి కిలో రూ. 5కు పడిపోయింది దాన్ని ఆదుకునేందుకు చర్యలు లేవు. కిలో రూ. 1కి టమాట పడిపోతే పట్టించుకోలేదు. బత్తాయి కిలో రూ. 12కి పడిపోయింది. దుర్భిక్ష పరిస్థితి నుంచి వచ్చిన పంట ఈ రకంగా ఉంటే రూ. 10 కోట్లు కేటాయిస్తే ఉల్లి రైతులును, రూ. 5 కోట్లు కేటాయిస్తే టమాట పంట రైతులను ఆదుకోవచ్చు. కానీ అలాంటి ఆలోచనలు చేయకుండా పోలవరం సందర్శనకు మాత్రం రూ. 20 కోట్లు కేటాయించి టీడీపీ కార్యకర్తలను బస్సులో పంపుతున్నారు. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే నిన్న పోలవరం మీద వచ్చిన దోపిడీ రిపోర్టు ప్రజలకు చూపించాలి. గత మే నెలలో అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. వారికి ఒక్క రూపాయి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. నాలుగు సంవత్సరాల్లో ఇన్‌పుట్‌ బకాయి ఎంత..? ముఖ్యమంత్రి అయ్యేనాటికీ ఎన్ని బకాయిలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ఇస్తానన్న రూ. రెండున్నర ఎటుపోయింది. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రైతుల కష్టాలు విని అధికారంలోకి వచ్చాక రూ.1.5 సబ్సిడీ ఇస్తానని ప్రకటించడంతో చంద్రబాబు ఆఘమేఘాల మీద చంద్రబాబు రూ. 2 సబ్సిడీ అని ప్రకటించి ఇప్పటి వరకు ఇవ్వలేదు. మళ్లీ ఆ విషయంలో డబ్బులు మొత్తం కట్టేయండి మత్స్యశాఖ రియంబర్స్‌మెంట్‌ చేస్తుందని వంచన. ఇలాంటి వంచనలకు పరాకాష్టలోనే మళ్లీ ఇప్పుడు కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రకటన.

రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక విమానాల్లో తిరిగే ఖర్చు రైతులకు కేటాయిస్తే బాగుండేది. రైతు రుణమాఫీ హామీ ఏమైందో, డ్వాక్రా రుణమాఫీ ఏమైందో ప్రజలకు తెలుసు. నిరంతరం విద్యుత్, రూ. 5 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇలాంటి హామీలు ఏమయ్యాయో ప్రజలందరికీ తెలుసు. 28 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో 14 మంది కర్నూలు వాసులే. కర్నూలు మార్కెట్‌లోనే ఉల్లిరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం దీనిపై రెస్పాండ్‌ కాలేదు. బ్యాంక్‌ నుంచి నోటీసులు వచ్చాయని దంపతులు ఇద్దరూ కర్నూలులో ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలోనే అధిక వృద్ధిరేటు సాధించానని మాట్లాడడం, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్‌గా చంద్రబాబు పాలనలో తయారైంది. ప్రాణం పోయిన తరువాత 108 వాహనం వచ్చినట్లుగా ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. చంద్రబాబుకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఆరు కరువు జిల్లాలను ఆదుకోవాలి. రబీ పంటకు కావాల్సిన విత్తనాలు 75 శాతం సబ్సిడీపై ఇప్పించాలి. 
 
Back to Top