జలయజ్ఞ ప్రదాత వైయస్‌ రాజశేఖరరెడ్డి

కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞ ప్రదాత అని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా సిద్దాపురం చెరువు వద్ద నిర్వహించిన వైయస్‌ఆర్‌ గంగా హారతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కోటి ఎకరాలకు నీరందించేందుకు జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మహానేత మొట్ట మొదటి పాదయాత్ర అనంతపురం నుంచి పోతిరెడ్డిపాడు వరకు చేశారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు విస్తర్ణకు మహానేత కృషి చేశారన్నారు. ఇవాళ దేవినేని ఉమా మోసపూరిత వ్యాఖ్యలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. చంద్రబాబు ఒక్క కార్యక్రమం కూడా తీసుకోవడం లేదన్నారు. గాలేరు, హంద్రీనీవా, ముచ్చుమ్రరి, సిద్దాపురం ఎత్తిపోతల పథకాలను చేపట్టింది వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే అన్నారు. 14 లక్షల ఎకరాలకు వైయస్‌ రాజÔó ఖరరెడ్డి సాగునీరు అందించారన్నారు. మహానేత మరణంతో ప్రాజెక్టులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయన్నారు. వైయస్‌ఆర్‌ బతికి ఉంటే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవని, రైతులు సుభిక్షంగా ఉండేవారన్నారు. చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతూ అందరిని మోసం చేస్తున్నారన్నారు. వాస్తవ విషయాలను ప్రజలకు చెప్పేందుకే వైయస్‌ఆర్‌ గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతారని చెప్పారు. 
Back to Top