టీడీపీ నేతల వెన్నులో పాదయాత్ర వణుకు పుట్టిస్తోంది


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ పాదయాత్ర చూసి టీడీపీ నేతల్లో వెన్నులో వణుకు మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోందన్నారు. శనివారం ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్న మోపిదేవి మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మడం లేదన్నారు. బాబు మాటలు విన్న జనం నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు తీరును చూసి మతిభ్రమించిందా అని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. చంద్రబాబు పాలనలో మోసపోయామని, ఈ సారి తప్పనిసరిగా వైయస్‌ జగన్‌ సీఎం కావాలని, మహానేత పాలన రావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని సభలు పెట్టినా ప్రజలు విశ్వసించడం లేదన్నారు. వైయస్‌ జగన్‌ రాజన్న రాజ్యాన్ని తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
 
Back to Top