ఉత్తమ నటుడిగా చంద్రబాబుకు నంది అవార్డు

– ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ పోరాటం
– రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం
– 29 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఒక్కసారైనా హోదా కోరారా?
– వైయస్‌ఆర్‌సీపీ హోదా కోరితే అవహేళన చేశారు
– ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు యూటర్న్‌
– చంద్రబాబు అసెంబ్లీకి నమస్కారం పెట్టిన సందర్భాలున్నాయా?
 విశాఖ: ఢిల్లీలో చంద్రబాబు నటనకుగానూ ఉత్తమ నటుడిగా నంది అవార్డును ఈ ఏడాది అందజేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో అపాయింట్‌మెంట్ల కోసం టీడీపీ నేతలు వెంపర్లడుతున్నారని విమర్శించారు. ఎవరూ ఆహ్వానించకపోయినా చంద్రబాబు వెళ్లి కలుస్తున్నారన్నారు. హేమాహేమీలను కలుస్తామని చెప్పి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు హేమామాలిని కలిశారన్నారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. 29 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన చంద్రబాబు ఎన్నిసార్లు ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడిగారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అని హేళనగా మాట్లాడింది చంద్రబాబు కాదా అన్నారు. ప్రత్యేక హోదా కోసం ధర్నాలు, బంద్‌లు చేస్తే వాటిని అణదొక్కింది మీరు కాదా అన్నారు. విద్యార్థులు యువభేరి కార్యక్రమాలకు హాజరైతే పీడీ యాక్టు నమోదు చేయమనింది నిజం కాదా అన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన చేపడితే..ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైయస్‌ జగన్‌ను ఏయిర్‌పోర్టులో నిలిపివేశారన్నారు. దేశంలోని జాతీయ పార్టీల నేతలను వైయస్‌ఆర్‌సీపీ మద్దతు కోరిందని తెలిపారు. నాలుగేళ్లు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టి..మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని తెలిసి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన నారా వారి ఢిల్లీ యాత్ర అనే సినిమా చూశారన్నారు. ఢిల్లీలో ఎంత బాగా నటించారో అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ మెట్లకు ఏ రోజు కూడా దండం పెట్టని చంద్రబాబు పార్లమెంట్‌ మెట్లకు దండం పెడుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారన్నారు. ఈ ఏడాది జ్యూరీ అవార్డులు ప్రదానం చేశారని, గతేడాది బాలకృష్ణకు నంది అవార్డు ఇచ్చారని, ఈ ఏడాది చంద్రబాబుకు వస్తుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో పెద్ద పెద్ద నాయకులను కలువబోతున్నామని ప్రకటించిన టీడీపీ నేతలు హేమామాలినిని కలిసి వ చ్చారన్నారు. బాబ్బాబు అంటూ సెంట్రల్‌హాల్‌లో ఎంపీలతో ఫోటోలు తీసుకొని ప్రచారం చే శారన్నారు. గత 13 రోజులుగా అవిశ్వాస తీర్మానం విషయంలో ఎందుకు వాయిదా పడుతుందని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కుంభకర్ణుడి మాదిరిగా నిద్రపోతున్నారని, రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదన్నారు. అన్నా డీఎంకేకు చెందిన ఎంపీలతో ఎందుకు చంద్రబాబు మాట్లాడలేకపోయారన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నిన్న ఢిల్లీలో మీడియా సమావేశంలో కూడా అవే మోసాలు చెప్పారన్నారు.

నరేంద్ర మోడీ పేరు ఎత్తే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు. నాలుగేళ్లుగా మీరు చెప్పిన మాటలను మీడియా ముందు పెట్టే ధైర్యం ఉందా అని నిలదీశారు. నాలుగేళ్లుగా ఎందుకు మాట్లాడలేదంటే చంద్రబాబు సమాధానం చెప్పడం లేదన్నారు.  మీ కొడుకు నారా లోకేష్‌ అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటే చంద్రబాబు సమాధానం చెప్పడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల కష్టాలు చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు. ఆయనకు స్వప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. మాటలు చెబితే సరిపోదని, షూటింగ్‌లతో కాలయాపన చేస్తే హోదా రాదన్నారు.

విజయమాల్యాను చంద్రబాబు కలిశారని విజయసాయిరెడ్డి పేర్కొంటే దానిపై సమాధానం చెప్పే ధైర్యం టీడీపీ నేతలకు లేదన్నారు. పార్లమెంట్‌ మెట్లకు కాదు, నరేంద్రమోడీ పాదాలకు చంద్రబాబు దండం పెట్టారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ చేస్తున్న పోరాటాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని అమర్‌నాథ్‌ కోరారు. పార్లమెంట్‌ నిరవధిక వాయిదా పడిన మరుక్షణమై ఎంపీలు రాజీనామా చేస్తారని వెల్లడించారు. 
 
Back to Top