ధరలు తగ్గించని సర్కార్ గద్దె దించుతాం

విజయనగరంః
నెలల తరబడి ధరలు మంటెత్తిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు
వ్యవహరిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు అదుపు
చేయాలని డిమాండ్ చేస్తూ... వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇవాళ విజయనగరం జిల్లా
కేంద్రంలోని రైతు బజార్ వద్ద నాయకులు ధర్నా చేశారు.‘చంద్రన్న రాజ్యం
దోపిడీ రాజ్యం’, ‘నిత్యావసర ధరలు ఆకాశంలో- ప్రజలు ఉపవాసంలో’ అని మహిళలు
ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎంతసేపు
చంద్రబాబు సింగపూర్, జపాన్ జపం చేస్తున్నారే  తప్ప.. సామాన్య ప్రజలను
ఏమాత్రం పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు
పెంచనని మాయమాటలు చెప్పి గద్దెనక్కిన చంద్రబాబు...హామీలన్నీ విస్మరించి
మోసం చేశారన్నారు. పెంచిన ధరలు తగ్గించేవరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా
చేపడుతామని మహిళలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  

చంద్రబాబు
వచ్చాక ఏం కొనాలన్నా భయపడే పరిస్థితి నెలకొందని నేతలు నిప్పులు చెరిగారు.
కిలో టమాట దాదాపు రూ.100 లకి చేరిందంటే ప్రభుత్వం పనితీరు ఎంత దారుణంగా
ఉందో అర్థమవుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు
దిగివచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద బతుకుల జీవితాలతో
ఆడుకుంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదన్నారు. 
Back to Top