గుండెల్లో కొలువైన నాయ‌కుడు వైఎస్సార్‌


హైద‌రాబాద్) అసెంబ్లీ లాంజ్ నుంచి దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చిత్ర‌ప‌టాన్ని తొల‌గించ‌టంపై వైఎస్సార్‌సీపీ తీవ్ర నిర‌స‌న తెలిపింది. పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందం అసెంబ్లీకి వెళ్లి స్పీక‌ర్ ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నించింది. స్పీక‌ర్ అందుబాటులో లేక‌పోవ‌టంతో అసెంబ్లీ కార్య‌ద‌ర్శి స‌త్య‌నారాయ‌ణ ను క‌లిసింది. స్పీక‌ర్ కు విన‌తి ప‌త్రం ఇవ్వాల‌ని కోరుతూ కార్య‌ద‌ర్శి చేతికి ఒక విన‌తి ప‌త్రాన్ని అంద చేశారు. అసెంబ్లీ లాంజ్ లో తొల‌గించిన దివంగ‌త మ‌హా నేత వైఎస్సార్ చిత్ర ప‌టాన్ని త‌క్ష‌ణ‌మే ఏర్పాటు చేయాల‌ని ఆ విన‌తి ప‌త్రంలో పేర్కొన్నారు. 
ఈ సంద‌ర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మ‌న‌స్సులోని ఆవేద‌న‌ను బ‌య‌ట పెట్టారు. 
వైఎస్సార్ ఫోటో ను ఎందుకు తొల‌గించార‌ని ఎమ్మెల్యేలు ప్ర‌శ్నించారు. దీనికి బ‌దులిస్తూ స్పీక‌ర్ అనుమ‌తితోనే ఫోటోను తొల‌గించామ‌ని కార్య‌ద‌ర్శి చెప్పారు. దీనిపై ఎమ్మెల్యేలు అభ్యంత‌రం తెలియ చేస్తూ అక్క‌డ బైఠాయించారు. అసెంబ్లీ స‌మావేశాల లోపు ఫోటోను ఏర్పాటు చేయ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. దీంతో స్పీక‌ర్ రాగానే చ‌ర్చించి, వైఎస్సార్ ఫోటోను ఏర్పాటు చేస్తామ‌ని కార్య‌ద‌ర్శి హామీ ఇచ్చారు. దీంతో పార్టీ నాయ‌కులు ధ‌ర్నాను విర‌మించారు. 
Back to Top