వైయస్సార్‌ కుటుంబంను ప్రతిగడపలోకి తీసుకెళ్లాలి

దాచేపల్లి: వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంను ప్రతి గడపకు తీసుకెళ్లాలని ఆ పార్టీ బీసీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు. మండలంలోని కేసానుపల్లి గ్రామంకు మంగళవారం వచ్చిన జంగా నేతలతో మాట్లాడారు. ఈ కార్యక్రమం గురించి నేతలను అడిగితెలుసుకున్నారు. పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమంను ప్రతిష్టంగా నిర్వహించాలని సంకల్పంతో ఉన్నారని, ఈ కార్యక్రమంను సమర్ధవంతంగా నిర్వహించాల్సిన బాధ్యతను నేతలు, బూత్‌లెవల్‌ కన్వీనర్లు, కమిటీసభ్యులు తీసుకోవాలని జంగా సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వైయస్సార్‌ సువర్ణయుగం గురించి వివరించాలని, జగన్‌ సీఎం అయితే అమలు చేసే నవరత్నాల యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రజలకు వివరించాలని జంగా చెప్పారు. నవరత్నాల ద్వారా ప్రజల తలరాతలు మారుతాయని, నవరత్నాలతో పేదల బతుకులు మారుతాయనే విషయంను ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనాలో చేసిన వాగ్ధానాలను ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, చంద్రబాబు మోసాలను ప్రజలకు అర్ధమైయ్యేలా వివరించాలన్నారు. వైఎస్సార్‌ కుటుంబం ద్వారా ప్రతి ఒక్కరు పార్టీ సభ్యత్వంలో భాగస్వాములు చేయాలన్నారు. జంగా వెంట పార్టీ మండల కన్వీనర్‌ షేక్‌ జాకీర్‌హుస్సేన్, ఎంపీటీసీ జంగా సైదులు, నేతలు మందపాటి కృష్ణారెడ్డి, ఉల్లేరు హనుమంతరావు, వినుకొండ కోటేశ్వరరావు, చిరంజీవి, వేముల శ్రీహరి, వేముల తిరుపతయ్య, లింగయ్య, రామారావు తదితరులున్నారు.

తాజా ఫోటోలు

Back to Top