వైయస్ఆర్‌సీపీకి ఆంధ్రలో 112 అసెంబ్లీ సీట్లు

హైదరాబాద్: 

వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ సీమాంధ్రలో హవా నడుస్తుందని తాజాగా నిర్వహించిన 'ఆరా' సర్వేలో వెల్లడైంది. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు 105 నుంచి 112 అసెంబ్లీ స్థానాల్లో విజయాలు సాధిస్తారని ఆరా సర్వేలో తేటతెల్లం అయింది. అలాగే 15 నుంచి 18 ఎంపీ స్థానాలకు కూడా కైవసం చేసుకుంటుందని సర్వే తేల్చింది. టీడీపీ-బీజేపీ కూటమి 55 నుంచి 65 అసెంబ్లీ సెగ్మెంట్లు, 7 నుంచి 10 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీ, స్వతంత్రులకు 10 నుంచి 15 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ సీటు వచ్చే వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే తెలిపింది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశమే ఉందని ఆరా సర్వే పేర్కొంది. టీఆర్‌ఎస్‌కు 52 నుంచి 57 అసెంబ్లీ సీట్లు, 7 నుంచి 9 ఎంపీ సీట్లు వచ్చే అవకాశముంది. కాంగ్రెస్- సీపీఐ కూటమికి 43 నుంచి 45 అసెంబ్లీ స్థానాలు, 4 నుంచి 6 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని సర్వే తెలిపింది. టీడీపీ- బీజేపీ కూటమికి 12 నుంచి 16 అసెంబ్లీ సెగ్మెంట్లు, 2 నుంచి 3 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. వైయస్‌ఆర్‌సీపీకి తెలంగాణలో 3 నుంచి 6 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ సీటు దక్కే అవకాశం ఉంది. ఎంఐఎంకు 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లు, 1 నుంచి 2 ఎంపీ సీట్లు వస్తాయని  'ఆరా' సర్వే ఫలితాలను బట్టి వెల్లడవుతోంది.

Back to Top