తిరుపతిలో శుక్రవారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ భేటీ

హైదరాబా‌ద్, 12 జూన్‌ 2013:

రాయలసీమ, నెల్లూరు జిల్లాల వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుల సమావేశం శుక్రవారంనాడు తిరుపతిలో జరుగుతుందని పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, సీజీసీ సభ్యుడు భూమా నాగిరెడ్డి తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ సమావేశంలో పాల్గొని, నాయకులకు దశ, దిశను నిర్దేశిస్తారని చెప్పారు. సభకు 'వైయస్‌ఆర్‌ ప్రాంగణం' అని పేరుపెట్టినట్లు చెప్పారు.

స్థానిక ఎన్నికలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలకు తాము రెడీ అంటూ కిరణ్‌ ప్రభుత్వం డాంబికాలు పలుకుతోందన్నారు. ఉప ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌, టిడిపిలకు ఘోర పరాజయం తప్పదని భూమా నాగిరెడ్డి అన్నారు. అందుకే ఎన్నికల షెడ్యూల్‌ను జాప్యం చేస్తోందని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు వారు ‌తెలిపారు.

Back to Top