వెన్నపూసరెడ్డికి వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు

అమరావతి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డికి పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం వైయస్‌ఆర్‌ సీఎల్పీ కార్యాలయంలో వెన్నపూస గోపాల్‌రెడ్డి గెలుపును పురస్కరించుకొని పార్టీ ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకొని స్వీట్లు పంపిణీ చేశారు. ఇది ప్రజా విజయమని, ప్రజాక్షేత్రంలో వైయస్‌ఆర్‌సీపీదే గెలుపు అని వైయస్‌ జగన్‌ అన్నారు.

Back to Top