హైకోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపించాలి

హైదరాబాద్) కాల్ మనీ
బాగోతంలో చంద్రబాబు సాగిస్తున్న నాటకాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు.
దేశ మంతా నివ్వెరపోయే రీతిలో సాగిన కుంభకోణంపై ఆయన .. ముఖ్యమంత్రిచంద్రబాబు కి బహిరంగ
లేఖ రాశారు. ఈ లేఖను  వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, పార్థసారధి
మీడియాకు విడుదల చేశారు.

లేఖ సారాంశం ఇలా ఉంది..

గడచిన నాలుగురోజులుగా బయటకు
వస్తున్న కాల్  మనీ సెక్సు రాకెట్ వ్యవహారం
విస్మయాన్ని కలిగిస్తోంది. గత 19 నెలలుగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నత
స్థాయి పోలీసు అధికారులు, పరిపాలన అధికారులు కొలువు తీరిన విజయవాడలో ఇటువంటి ఘటన
జరిగిందని వైఎస్ జగన్ గుర్తు చేశారు.

కాల్ మనీ పేరిట పచ్చని
సంసారాల్లో చిచ్చు పెడుతున్నారని, వడ్డీలు సమర్పించుకోలేని కుటుంబాల్లోని మహిళల్ని
చెర పడుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. రాక్షసత్వానికి మించిన హీన స్వభావానికి,
మాటలకు అందని నీచ గుణానికి ఇది నిదర్శనంఅన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
మంత్రులు తెర వెనుక ఉండి కాల్ మనీ కమ్ సెక్సు మాఫియాను నడిపించారని అభిప్రాయ పడ్డారు.
టీడీపీ నాయకుల విదేశీ టూర్ లకు, స్వాగత సంబరాలకు మాఫియా నేతలే స్పాన్సర్
చేస్తున్నారనిచెప్పారు.

ఇటువంటి పరిస్థితుల్లో
చంద్రబాబు ప్రయత్నాలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. టీడీపీ నేతల్నిఎలా
తప్పించాలా అన్న  ఆలోచనతోనే ఇతర పార్టీల
నేతలకు ఈ బురద అంటించాలని ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని వివరించారు. ప్రతిపక్ష
పార్టీల్ని టార్గెట్ చేసేందుకు పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.  దీంతో ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టే
వైఖరి తో పాటు, మీ నాయకుల నేరాలు, ఘోరాల్ని సమర్థించుకొంటారని ప్రజలకు అర్థం
అవుతోంది. మహిళా తహశీల్దార్ వనజాక్షి మీద ఆటవికంగా దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని
ని నెంబర్ వన్ ఎమ్మెల్యేగా సన్మానిస్తుంటే ఈ రాక్షస రాజ్యంలో ప్రజలకు రక్షణ
ఎక్కడిది..! రిషితేశ్వరి ఆత్మహత్య కారకుల్ని వెనుకేసుకొని రావటం, కల్తీ
మద్యం కేసులో అసలు దోషుల్ని దాచేసి చిరుద్యోగుల మీద చర్యలు తీసుకోవటం వంటివి
చూస్తుంటే సివిల్ సర్వెంట్లు ఎలా పనిచేయగలుగుతారు. ప్రభుత్వమే మాఫియాగా మారి,
ప్రజాస్వామ్యం మూలాల్ని నిర్వీర్యం చేసి.. సహజ సంపదల్ని, కుటుంబాల్లోని స్త్రీలను
దోచుకోవటం  ఎక్కడైనా ఉందా అని వైఎస్ జగన్
ప్రశ్నించారు.

          దీనికి మీరు సుపరిపాలన అని పేరు పెట్టుకోవటం, దాన్ని అమ్ముడుపోయిన స్థానిక, జాతీయ మీడియాల్లో ప్రచారం చేయించుకోవటాన్ని తెలుగుజాతి
అసహ్యించుకొంటోందని వైఎస్ జగన్ వివరించారు. లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్
మాఫియా, రియల్ఎస్టేట్ మాఫియా,సెక్స్ మాఫియా, మనీ మాఫియావంటి వంద రకాల మాఫియాలకు
విజయవాడను రాజధానిగా చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.

          మహిళలపై సాగుతున్న అత్యాచారాల మీద నుంచి ద్రష్టి
మళ్లించేందుకు కాల్ మనీ వ్యాపారులకు డబ్బు తిరిగి చెల్లించవద్దని చెబుతున్నారని
చంద్రబాబు వైఖరిని వైఎస్ జగన్ తూర్పార బట్టారు. ఈ బాగోతాలన్నింటికి పూర్తి బాధ్యత
వహించాల్సిన చంద్రబాబు.. దాని నుంచి తప్పించుకొనేందుకే చౌకబారు వ్యూహాలకు
దిగుతున్నారని ఆయన అన్నారు. ఈ బాగోతంలో దోషులు అందరినీ చట్టం ముందు నిలబెట్టాలని,
బాధితులకు డబ్బుని పూర్తిగా ఇప్పించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానం ఆధ్వర్యంలోనే
విచారణ జరిగేలా ఎంక్వయిరీ కోరాలని వైఎస్ జగన్ అన్నారు. 

Back to Top