వెంక‌య్య‌నాయుడికి వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌:  ఉప రాష్ట్ర‌ప‌తిగా విజ‌యం సాధించిన వెంక‌య్య నాయుడుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. శుక్ర‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడు  ఘనవిజయం సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాల కృష్ణ గాంధీపై 272 ఓట్ల మెజార్టీని సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో వెంక‌య్య‌నాయుడికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. వెంక‌య్య విజ‌యం ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌దువుల‌కు ఏక‌గ్రీ ఎన్నికే  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష అని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.  రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా తెలుగు వ్య‌క్తి ఉండ‌టం గ‌ర్వ‌కార‌ణమ‌ని ఆయ‌న అన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top