ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు అభినంద‌న‌లు

హైద‌రాబాద్‌:  శ్రీహరికోట నుంచి ప్రయోగించిన‌ పీఎస్ఎల్వీ సీ-37 రాకెట్ విజ‌య‌వంతంగా 104 ఉపగ్రహాలనూ వాటి కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. ఈ సంద‌ర్భంగా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శాస్త్ర‌వేత్త‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ‘జ‌య‌హో ఇస్రో’ అంటూ శాస్త్ర‌జ్ఞుల ఘ‌న‌తను పొగిడారు. పీఎస్ఎల్వీ సీ-37 రాకెట్ విజ‌యం సాధించ‌డ‌మే ఆల‌స్యం వెంట‌నే వైయ‌స్ జ‌గ‌న్ ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచంలో ఏ దేశాలు ఒకే‌సారి ప్ర‌వేశ‌పెట్ట‌న‌న్ని ఉప‌గ్ర‌హాల‌ను ఇస్రో ప్ర‌వేశ‌పెట్ట‌డంతో ఆయ‌న ఇస్రోకి అభినంద‌న‌లు తెలిపారు. చ‌రిత్రలో గుర్తుండిపోయే ఈ ప్ర‌యోగం ఇస్రో సాధించిన మ‌రో అద్భుత విజ‌య‌మ‌ని ఆయ‌న అన్నారు.


Back to Top