రొట్టెల పండుగలో పాల్గొన్న వైయస్ జగన్

()నెల్లూరులో వైయస్ జగన్ పర్యటన
()బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
()స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగకు హాజరు
()జననేతకు పార్టీ నేతలు, అభిమానుల ఘనస్వాగతం

నెల్లూరులో రొట్టెల పండుగ వైభవంగా జరిగింది. ప్రతిపక్ష నాయకుడు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టారు. రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని, ప్రజలకు అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ వైయస్ జగన్ రొట్టెలు పట్టుకున్నారు. జననేతకు రొట్టెలు అందించేందుకు భక్తులు ఎగబడ్డారు. ముందుగా బారాషహీద్ దర్గా వద్ద దాదాపు అరగంట పాటు వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనాలు నిర్వహించారు. మతపెద్దలు వైయస్ జగన్ ను ఆశీర్వదించారు. రొట్టెల పండుగలో పాల్గొన్న అనంతరం వైయస్ జగన్ తిరుపతికి పయనమయ్యారు.


నెల్లూరు పర్యటనలో భాగంగా ఉదయం హైదరాబాద్‌ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వైయస్ జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి తదితరులు ఎయిర్‌ పోర్ట్‌ కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం వైయస్ జగన్  రోడ్డు మార్గంలో నెల్లూరు బయలుదేరారు. 

రొట్టెల పండుగ సందర్భంగా విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఏపీ ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నా. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. 
– మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీ 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సిద్ధిస్తేనే అభివృద్ధి చెందుతుంది. అందుకే ప్రత్యేక హోదా రావాలని ప్రార్థించాం 
– అంజద్‌బాషా, ఎమ్మెల్యే

Back to Top