నవంబర్ 6నుంచి

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత చేపట్టనున్న పాదయాత్రకు "ప్రజాసంకల్పం"యాత్రగా నామకరణం చేశారు. హైదరాబాద్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగిన పార్టీ విసృత స్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.  నవంబర్‌ 6వ తేదీ నుంచి 6 నెలల పాటు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, వాటిని పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. 

వైయస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఇతర జిల్లాల్లో పార్టీ శ్రేణులు చేయాల్సిన కార్యక్రమాలపై విస్తృతస్థాయి సమావేశంలో చర్చించారు. వైయస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు తదితర నాయకులు హాజరయ్యారు. 

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ....మొత్తం 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3 వేల కి.మీ. కు పైగా వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో పదివేలకు పైగా గ్రామాల్లో వైయస్ జగన్ ప్రజలతో మమేకమవుతారు. పాదయాత్రలో వివిధ ప్రజాసంఘాలతో వైయస్ జగన్ 182 సమావేశాలు నిర్వహించనున్నారు. 125 భారీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. 


Back to Top