ప్రజా సంకల్ప యాత్ర @ 2200 కిలోమీటర్లు

- వైయ‌స్ జ‌గ‌న్‌కు న‌ర‌సాపురంలో ఘ‌న స్వాగ‌తం
పశ్చిమ గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలు రాయిని చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని 176వ రోజు  టౌన్‌ స్టేషన్‌ వద్ద వైయస్‌ జగన్‌ పాదయాత్ర 2200 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి, మొక్కను నాటారు. అనంతరం నరసాపురం స్టీమర్‌ రోడ్డు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొననున్నారు.కాగా, ఈ నెల 14వ తేదీ ప్ర‌జాసంకల్పయాత్ర 2000 కిలోమీట‌ర్లు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద దాటింది. అలాగే 22వ తేదీ ఉంగ‌టూరు నియోజ‌క‌వ‌ర్గంలో 2100 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటారు. 2200 కిలోమీట‌ర్లు దాటిన వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.


ప్రజాసంకల్పయాత్ర సాగుతుందిలా...
0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబరు 6, 2017)

100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబరు 14, 2017)
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబరు 22, 2017)

300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబరు 29, 2017)

400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)

500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబరు 16, 2017)

600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబరు ‌24, 2017)

700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)

800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)

900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)

1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)

1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, కొరిమెర్ల (ఫిబ్రవరి 7, 2018)

1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)

1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)

1400​‍ - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)

1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)

1600- గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)

1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్‌ (ఏప్రిల్‌ 7, 2018)

1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్‌ 18, 2018)

1900- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకి (ఏప్రిల్‌ 29, 2018)

2000- ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా  వెంకటాపుంర (మే 14, 2018)

2100-  ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉంగ‌టూరు నియోజ‌క‌వ‌ర్గం ( మే 22, 2018 )
2200- ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా టౌన్‌ స్టేషన్‌ వద్ద  2200 కిలోమీటర్ల మైలురాయి ( మే 30, 2018)

 

Back to Top