వైయస్ జగన్ జలదీక్ష

కర్నూలుః టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, తెలంగాణ సర్కార్ నీటి దోపిడీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ జలదీక్ష చేస్తున్నారు. కర్నూలు కేంద్రంగా దీక్షకు దిగారు. వైయస్ జగన్ దీక్షకు పార్టీశ్రేణులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారు మద్దతు నిలిచారు. వైయస్ జగన్ కు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. అంతకుముందు పులివెందుల నుంచి కర్నూలుకు చేరుకున్న వైయస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీక్షాస్థలి వద్ద మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి  వైయస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం ఏపీకి అన్యాయం చేస్తున్న కేసీఆర్, చంద్రబాబుల నిరంకుశ వైఖరిపై మండిపడ్డారు.


Back to Top