విద్యార్థులతో వైయస్ జగన్ ముఖాముఖి

అనంతపురంః ప్రత్యేకహోదా పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలన్న ప్రభుత్వ పెద్దలు ..అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించి ప్రజలను నిలువునా మోసం చేసిన తీరుపై వైయస్ జగన్ మండిపడ్డారు. అనంత యువభేరి వేదికగా ప్రత్యేకహోదాపై గర్జించారు. ప్రత్యేకహోదా పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. 

మనం పిచ్చోలమా?: ప్రియాంక, ఈసీ స్టూడెంట్‌
ఎన్నికలకు ముందు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ అంటే, 15 ఏళ్లు కావాలని చంద్రబాబు అన్నారు. ఇప్పుడేమో ఈ హోదా అవసరం లేదని చెబుతున్నారు. మనం ఏమైనా పిచ్చోలమా..హోదా రాకపోవడంతో మా యువత ఉపాధి కోల్పొయింది. హోదా ఉన్న రాష్ట్రాల్లో ఉద్యోగాలు వచ్చాయి. ఇది నిజం కాదా. అన్న మీరే ప్రత్యేక హోదా కోసం పోరాడాలి.

వైయస్‌ జగన్‌: హోదా ఉంటేనే పరిశ్రమలు పెడతారు. పారిశ్రామిక వేత్తలు చంద్రబాబు మోహం చూసి పెట్టరు. వారికి జీఎస్టీ, ఇన్‌కంట్యాక్స్‌ మినహాయింపులు ఉంటాయి కాబట్టి పరిశ్రమలు పెడతారు. ఇవన్ని కూడా వాస్తవం కాబట్టే టీడీపీ నేతలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే అంజనేయులు, ఎంపీ సీఎం రమేష్‌ పరిశ్రమలు పెట్టారు. స్థలాలు కూడా తీసుకున్నారు. పార్లమెంట్‌లో 2016, మార్చి 2న లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చింది. మన వైయస్‌ఆర్‌సీపీ వెబ్‌ సైట్‌లోకి వెళ్తే ఈ వివరాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. పూర్తి క్లారిటీలో మన వెబ్‌ సైట్‌లో ఉన్నాయి. ఇటువంటి రాజకీయ వ్యవస్థలోకి మీలాంటి యంగ్‌స్టార్స్‌ అడిగే ప్రశ్నలకు ఇప్పుడైనా సమాధానం దొరుకుతుందో లేదో చూడాలి.
–––––––––––––––––––––
దివ్యాంగులను కూడా బాబు మోసం చేశాడు: భాస్కర్, స్టూడెంట్‌ లీడర్‌
 వాల్మీకులను ఎస్టీలుగా, కాపులను బీసీలుగా చేస్తానని హామీ ఇచ్చారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న ఈ దొంగ బాబు ఈ రోజు కులాలను అడ్డుపెట్టుకొని అందర్ని మోసం చేశాడు. మాలాంటి దివ్యాంగులను కూడ మోసం చేశాడు. మాకు ప్రత్యేక మంత్రివర్గ శాఖను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు. ప్రత్యేక హోదా కోసం మీరు చేసే పోరాటాల్లో పాల్గొంటాను. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు త్యాగం చేసేందుకు కూడ వెనుకాడను. 

వైయస్‌ జగన్‌: చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశాడు. మీరు అడిగే ప్రశ్నలతోనైనా చంద్రబాబు మనసు మారుతుందని ఆశిద్దాం.
–––––––––––––––––––––––––––––
మహిళలకు భద్రత లేదు: శిరీషా, బీ పార్మసి స్టూడెంట్‌
బాబు పాలనలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే మహిళా తహశీల్దార్‌ను జుట్టు పట్టుకొని కొట్టారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు తన కొడలిని వేధించారు. అదే వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మహిళల జోలికి వచ్చిన వారి తోలు తీశారు. మీరు వస్తేనే మాకు భద్రత కలుగుతుంది.

వైయస్‌ జగన్‌: ఆ రోజు టీవీల్లో ఇచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్‌ చూసి అందరు మోసపోయారు. పట్టపగలే ఎంఆర్వో పై దాడి చేశారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్నా..బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సెల్‌ఫోన్‌ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి, తన వద్ద ఉన్న లీడర్లు మహిళలను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీరు పెట్టే ఈ గడ్డితోనైనా కాస్తోకూస్తో బుద్ధి వస్తుందని ఆశిద్దాం.
–––––––––––––––––––––––––––
ప్యాకేజీని ఎలా సమర్ధిస్తారు: అనుషా, ఇంజనీర్‌ విద్యార్థిని
రాజ్యసభలో ప్రత్యేక హోదాతో ఎలాంటి ప్రయోజనం లేదని అరుణ్‌జైట్లీ అన్నారు. అదే అరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు చంద్రబాబు అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి అభినందించారు. 

వైయస్‌ జగన్‌: ఏ ప్యాకేజీ మనకు రాకపోయినా కూడా , ప్యాకేజీ వచ్చి మనకు వారు ఇచ్చేసినట్లు భ్రమకల్పిస్తూ ఆ రోజు బ్రహ్మండమైన స్టేట్‌మెంట్‌ఇచ్చారు. ఈ మధ్య మళ్లీ కొత్త డ్రామా మొదలు పెట్టారు. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. తన అవసరం కోసం ఏమైనా మాట్లాడుతారు. 
––––––––––––––––––––––
బాబుపై కేసులు లేవా: సంపత్, లా విద్యార్థి
నేను చదువుకున్న చదువులో ఒక గవర్నమెంట్‌ ఉద్యోగి లంచం కేసులో ఇరుక్కుంటే వెంటనే అరెస్టు చేస్తారు, ఉద్యోగం నుంచి తొలగిస్తారు. అదే చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయారు. ఆయనకు మాత్రం కేసులు లేవు.  

వైయస్‌ జగన్‌: నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో పట్టుబడినా కూడా కోట్లు రూపాయాలు చేతులు మార్చుతూ డబ్బుతో దొరికినా కూడా ఆ మనిషి మీదా ఏ కేసు కూడా లేదు. ఇదే చిన్న చితక ఉద్యోగి అయితే బ్లాక్‌ మనీతో దొరికితే వెంటనే సస్పెండ్‌ చేసే వారు. ఇవాళ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి. చంద్రబాబు కన్న పైఅధికారంలో ఉన్న వారు ఆలోచన చేయాలి. ఒక్కొక్కరికి ఒక న్యాయం ఉంటే ప్రజాస్వామ్యం బతకదు. లా చదువుతున్న స్టూడెంట్‌ ఇలాంటి ప్రశ్న వేసినప్పుడైనా పెద్దలు ఆలోచించాలి.
–––––––––––––––––––
ప్రత్యేక హోదా తీసుకురావచ్చు కదా:  రవళి, ఈసీ ఫైనల్‌ ఇయర్‌
ప్రత్యేక హోదా రావడం వల్ల చాలా రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. చంద్రబాబు కోట్లు ఖర్చు చేసి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. బాబు వేరే దేశాలకు వెళ్తుంది మనకు పెట్టుబడులు తీసుకురావడానికా? ఇక్కడ దోచుకున్నది దాచుకోవడానికా? ఆయన మోహం చూసి ఎవరు పెట్టుబడులు పెడుతారు.

వైయస్‌ జగన్‌: ఆ ప్రత్యేక హోదా వల్ల వచ్చే బెనిఫిట్లతోనే పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారు. చంద్రబాబు మోహం చూసి ఎవరు ముందుకు రారు. ఆయనకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది. చంద్రబాబు వేరే దేశానికి వేళ్తే ప్రత్యేకమైన విమానాల్లో వెళ్తారు. ఆ విమనాలు, టెంపరరీ ఇళ్లకు పెడుతున్న ఖర్చులు, కన్సల్ టెంట్లకు చేసే వృధా డబ్బులు, ప్రత్యేక హోదా కోసం పెట్టి ఉంటే ఎప్పుడో మన రాష్ట్రం బాగుపడేది.
–––––––––––––––––––––
సినిమా డైరెక్టర్లతో రాజధాని నిర్మాణమా?: హానీషా, సివిల్‌ ఇంజీనీర్‌
మన దేశంలో ఎంతోమంది గొప్ప ఇంజీనీర్లు ఉన్నారు. సినిమాల కోసం టెంపరరీ సెట్లు వేసే రాజమౌళితో రాజధాని నిర్మిస్తారా? మేం ఏం చేయాలి అన్నా..

వైయస్‌ జగన్‌: ఇంతవరకు రాజధాని ప్రాంతంలో ఒక్క ఇటుక కూడా పెట్ట లేదు. అసెంబ్లీ ఎలా ఉంటుందో ఎలా కడుతారో ఎవరికి తెలియదు. నాలుగేళ్లు పూర్తి అవుతోంది. ఇంతవరకు ఎలాంటి బిల్డింగ్‌లు కట్టలేదు. కేంద్రం నుంచి రూ.500 కోట్లు తీసుకున్నారు. వాటికి బిల్లులు ఇవ్వరు, వాళ్లు ఎక్కువ డబ్బులు ఇవ్వడం లేదు. ఇది చంద్రబాబు తోమ్మిదేళ్లు సీఎంగా చేసిన అనుభవం. ఏదైనా బిల్డింగ్‌ కట్టాలంటే ఆర్కిటెక్ట్‌ల వద్దకు వెళ్లాలి కానీ, సినిమాలు తీసే డైరెక్టర్ల వద్దకు వెళ్లే వారిని నా జీవితంలో ఎక్కడ చూడలేదు. చంద్రబాబు ఏ బిల్డింగ్‌ కట్టడు. కేవలం సినిమాలు మాత్రమే చూపిస్తారు.
––––––––––––––––––––––––
మా అమ్మ రోజు కూలీ..ఎలా చదువుకోవాలి:  అంజీ, కదిరి
ఎన్నికలకు ముందు చంద్రబాబు బీసీ విద్యార్థులకు ఆధార్‌తో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తానని చెప్పారు. నేను ఎంబీఏ చదవాలనుకున్నాను. అయితే ఏ కాలేజీకి వెళ్లినా రూ.60 వేలు అడుగుతున్నారు. మా అమ్మ రోజు కూలీ. ఎక్కడి నుంచి అన్ని వేలు తీసుకురావాలి. వైయస్‌ రాజశేఖరరెడ్డి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ఇచ్చారు. మీరు ముఖ్యమంత్రి అయి నాలాంటి పేద విద్యార్థులను ఆదుకోవాలని కోరుతున్నాను అన్నా.

వైయస్‌ జగన్‌: రాష్ట్రంలో ఫీజులు చూస్తే వేలు, లక్షలలో ఉన్నాయి. చంద్రబాబు ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మాత్రం ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. సంవత్సరం తరువాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. మిగిలిన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని అడిగితే ఆస్తులు అమ్ముకోమని చెబుతున్నారు. దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తిగాఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తాను. 
––––––––––––––––––––––––––
రైతుల భూములు తీసుకుంటే ఎలా బతకాలి?:   రేఖ, ఇంజనీరింగ్‌ విద్యార్థిని
నేను రైతు బిడ్డను. మా జీవనాధారమైన భూములు లాక్కుంటే మా పరిస్థితి ఏంటన్న. అమరావతి లాంటి రాజధాని నిర్మించాలని మూడు పంటలు పండే భూములు తీసుకుంటున్నారు. 

వైయస్‌ జగన్‌: ఎక్కడైనా గవర్నమెంట్‌ భూమి ఉంటే 20 వేలు తీసుకున్నా ఫర్వాలేదు. కానీ రైతులకు ఇష్టం లేకుండా బయపెట్టి, ప్రలోభపెట్టి భూములు తీసుకోవడం దారుణం. మొదట నూజీవీడు అన్నారు. ప్రజలను ఆ వైపు దారి చూపించారు. తక్కువ ధరలకు ఇక్కడ భూములు కొనుగోలు చేసి ఇక్కడ రాజధాని అంటున్నారు. అంతటితో ఆగిపోకుండా జోన్లు తీసుకొనివచ్చి చంద్రబాబు తన బినామీలను సేఫ్‌ జోన్‌లో పెట్టడం, రైతుల భూములను అగ్రి జోన్లలో పెట్టడం చాలా దారుణం. దుర్మార్గపు ఆలోచనలకు మాత్రం దేవుడు, ప్రజలు తప్పకుండా మొట్టికాయలు వెస్తారని ఆశీస్తున్నాను.
–––––––––––––––––––––––––
ఆరోగ్యశ్రీ ఫైల్‌పై మొదటి సంతకం చేయండి అన్న:  గురప్ప, 
వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 108, 104 దిగ్విజయంగా సాగేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సీఎం చంద్రబాబు నాకు రూ.72 వేల అప్పు ఉన్నాడు. ఆ డబ్బులు ఎప్పుడిస్తాడన్న? ఆరోగ్యశ్రీపై మీరు సీఎం కాగానే మొదటి సంతకం చేయాలన్నా.

వైయస్‌ జగన్‌:  ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో  అందరికి తెలుసు. ఆసుపత్రికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తామన్న పరిస్థితి లేదు. మనం వస్తే ఆరోగ్యశ్రీని బ్రహ్మండంగా చేస్తాం. డెంగీ వంటి జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొని వస్తాను. వైద్యం చేయించుకన్న తరువాత ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకునేందుకు కూడా డబ్బులు ఇస్తానని మాట ఇస్తున్నాను.
––––––––––––––––––––––––
పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి:  హర్షవర్ధన్, జెఎన్‌టీయూ కాలేజీ 
చంద్రబాబు చిత్తూరుకు, అనంతపురంకు ఫార్మా ఇండస్ట్రీ ఇస్తామనన్నారు. ఏపీలో 40 ఫార్మా ఇండస్ట్రీలు ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీలు వస్తే మాలాంటి వారు బాగుపడుతారు.

వైయస్‌ జగన్‌: ఇంజీనీర్, ఫార్మా విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోవడంతో పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే కార్యక్రమం గట్టిగా చేపడుతాం.

తాజా వీడియోలు

Back to Top