క్రీ్డలలో రాణించిన మహేష్ బాబుకు ప్రోత్సాహకం అందించిన వైయస్ జగన్ మోహన రెడ్డి

విజయవాడ: 

శ్రీలంకలో జరిగిన స్టూడెంట్ ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన, కృష్ణా జిల్లా విద్యార్ధి వీర్ల మహేష్ బాబుకు వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.5 లక్షల ప్రోత్సాహకాన్ని  ప్రకటించారు. విజయవాడలో జరిగిన పార్టీ బిసి సదస్సులో తనను కలిసిన మహేష్ బాబును ఆయన అభినందించారు. పా ర్టీ అధికారంలోకి వస్తే మహేష్ బా బుకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని, అన్ని విధాలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. కృష్మా జిల్లా పమిడిముక్కల మండలం కుడేరు గ్రామానికి చెందిన మహేష్ , నరసాపురంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజిలో చదువుతూ డిస్కస్ త్రో, కబడ్డీ క్రీడల్లో రాణిస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి మహేష్ ను తీసుకుని వచ్చారు.

Back to Top