ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు

నెల్లూరుః  పీఎస్ ఎల్ వీ సీ 35 ప్రయోగం విజయవంతమవ్వడంపై ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా శాస్త్రవేత్తలను అభినందించారు. బహుళ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ35 విజయవంతంగా ఆ పనిని పూర్తి చేసింది. 

శ్రీహరికోటలోని సతీశ్‌ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉదయం 9.12 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ35 నింగిలోకి దూసుకెళ్లింది. తొలుత స్కాట్ శాట్ -1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఈ నౌక మొత్తం 2గంటల 15 నిమిషాల్లో మరో ఏడింటిని వాటి కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. నాలుగు దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది.
Back to Top