ప్రతి మామిడిలో మా రాజన్న చిరునవ్వు

15 ఏళ్లుగా బ్యాంక్‌లో ఉన్న బంగారం ఇంటికొచ్చింది
రుణమాఫీ చేసి మా కుటుంబంలో సంతోషం నింపాడు
వైయస్‌ఆర్‌ పాలనలో మా కుటుంబం లబ్ధిపొందింది
చిత్తూరు: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే లబ్ధిపొందామని చిత్తూరు యువత సగౌరవంగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు అనూహ్య మద్దతు లభిస్తుంది. సొంత జిల్లా ప్రజలకు చంద్రబాబు ఏం చేయలేదని ప్రజలంతా దుమ్మెత్తిపోస్తున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రాదయాత్రలో పాల్గొన్న ఒక యువకుడు తనకు వైయస్‌ఆర్‌ హయాంలో జరిగిన మేలును గుర్తు చేసుకున్నాడు.. ఆ యవకుడు ఏం చెప్పాడంటే.. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో మా కుటుంబం లబ్ధిపొందింది. 2004లో ముఖ్యమంత్రి అవుతూనే బేషరుతుగా రుణాలు మాఫీ అన్నారు. ఆ రోజు పేపర్‌ పట్టుకొని పొలం గట్లపై పరిగెత్తుకుంటూ వెళ్లి మా నాన్నకు చెప్పాను. ఆ తరువాత రుణమాఫీ అయ్యి పాస్‌పుస్తకాలు మా ఇంటికి వచ్చాయి. అప్పుడు మా నాన్న కళ్లలో సంతోషం చూశాను. ఆ తరువాత 1995లో పంట కోసం మా అమ్మ బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకువస్తే 15 ఏళ్ల పాటు వడ్డీలు కట్టాం. వైయస్‌ఆర్‌ బంగారం రుణమాఫీ చేయడంతో 15 ఏళ్ల తరువాత బంగారం ఇంటికి వచ్చింది. అప్పుడు మా అమ్మ కళ్లలో సంతోషం చూశాను. మా అమ్మ ఒక్కరే కాదు.. రాష్ట్ర మహిళల కళ్లలో సంతోషం నింపిన ఘనత వైయస్‌ఆర్‌ది. ఆ తరువాత మామిడి చెట్లు ఇచ్చారు.. చెట్లను పెంచుకోండి, పొలం చుట్టూ కంచె వేసుకోండి అని డబ్బులు ఇచ్చారు. వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు ఎరువేస్తే డబ్బు, పొలం దున్నుతే డబ్బు.. వ్యవసాయాన్ని పండుగలా జరిపించారు. ఇప్పుడు మా పొలంలో కాసిన ప్రతి మామిడికాయలో మా రాజన్న చిరునవ్వు కనిపిస్తుంది. మా నాన్న అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యశ్రీతో వైద్యం చేయించారు. అదే విధంగా ఫీజురియంబర్స్‌మెంట్‌ ద్వారా నన్ను చదివించి వైయస్‌ఆర్‌ నాకు సమాజంలో గుర్తింపును అందించాడు.. ఇలా మా కుటుంబం ఒక్కటే కాదు.. రాష్ట్ర ప్రజలంతా లబ్ధిపొందారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే మా జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జగనన్న ప్రభుత్వం వస్తూనే మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి. 
 
Back to Top