పచ్చ దొంగలను జైలుకు పంపిస్తాం

 • రాజకీయ ఏకీకరణ అంటే ఇదేనా బాబూ?
 • పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లు కాదు.. సెటిల్‌మెంట్, కబ్జా సమ్మిట్‌లు
 • పచ్చదొంగల దోపిడీకి గురైన నగరంగా విశాఖ
 • భూదందాను సీబీఐకి అప్పగించాలన్నదే మా పార్టీ డిమాండ్‌
 • చంద్రబాబు 12 ఏళ్ల పరిపాలనలో విశాఖను అభివృద్ధి చేసింది శూన్యం
 • కలసికట్టుగా ఉద్యమించి టీడీపీ నేతల చదలును నిర్మూలిద్దాం
 • పద్మనాభ మండలంలో గంటా అల్లుడి భూకుంభకోణాలు
 • ప్రతిగ్రామంలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌
 • క్లస్టరైజేషన్‌ ఆఫ్‌ స్కూల్స్‌ పేరుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేత 
 • మా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రైవేట్‌ విద్యతో సమానంగా ప్రభుత్వ విద్య
 • విద్యా వ్యాపారం చేస్తున్న నారాయణ, గంటా, ఎంవీఎస్‌ మూర్తి
 • చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది
 • వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే నిజమైన లబ్ధిదారులకు భూముల పంపిణీ
 • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
విశాఖపట్నం: వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎన్నికైన శాసనసభ్యులను పదవులు, డబ్బులను ఎరజూపి  కొనడాన్నే రాజకీయ ఏకీకరణ అంటారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో చేసిన అన్యాయాలు, అక్రమాలపై విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. అన్ని సామాజిక వర్గాలను, అన్ని మతాలను, అన్ని రకాల వృత్తులో ఉన్న వారిని ఏకీకృతం చేసి అభివృద్ధి పథం వైపు నడిపించాలన్నదే ఏకీకరణ. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు చేస్తున్న పని ఇతర పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం. వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇది చాలా తప్పు అని సాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పులు విజయసాయిరెడ్డి మాటల్లోనే...

భూ కుంభకోణం రూ. 2 నుంచి 3 లక్షల కోట్లుంటుంది..
గతంలో పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లని ఈ విశాఖపట్నంలో రెండుసార్లు జరిపారు. మొదటి సమ్మిట్‌లో రూ. 2 లక్షల కోట్లకు ఎంఓయూలు, రెండో సమ్మిట్‌లో 4 లక్షల కోట్ల పై చిలుకుగా ఎంఓయూలు ఎంటర్‌ చంద్రబాబు అయ్యాయని చెప్పారు. నిజానికి నేను ప్రశ్నిస్తున్నది ఇది నిజంగా మొత్తం వచ్చినటువంటి ఈ రోజుకు ఇన్వెస్ట్‌మెంట్‌ నూరు కోట్లకు కూడా లేదు. కానీ విశాఖలో జరిగిన భూ కుంభకోణం రూ. 2 నుంచి 3 లక్షల కోట్ల వరకు ఇంచుమించుగా లక్ష ఎకరాలను టీడీపీకి చెందిన నేతలు స్వయాన సీఎం, ఆయన కుమారుడు పర్యవేక్షణలో జరిపిన కుంభకోణం. ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందిరితో కూడా కలిపి పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌ చెప్పిన వ్యక్తి... ఇది పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లు కాదు సెటిల్‌మెంట్, కబ్జా సమ్మిట్‌లని కూడా చెప్పుకోవచ్చు. విశాఖపట్నానికి స్టీల్‌ సిటీ అన్న పేరు ఎందుకువచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సిటీకి ఉక్కునగరంగా పేరు తెచ్చారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇది పసుపు పచ్చ దొంగల దోపిడీకి గురైన నగరంగా మిగిలిపోయినట్లు తెలుస్తోంది. 

గతంలో సిట్‌ విచారణలో ఏం జరిగింది..
చంద్రబాబు గతంలో 1995–2004 పాలనలో గానీ, ఇప్పుడు 2014–17లో విశాఖను అభివృద్ధి చేసింది శూన్యం. దశాబ్ద్ధాలుగా ఉన్న ఇమేజ్‌ను భూదందాలతో దెబ్బతీశారు. తెలుగుదేశం వారు ఈ భూములకు సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే స్టోలన్‌ సిటీ (దోపిడీ దారులకు గురైన నగరం) తయారు చేశారు. ఈ భూకబ్జాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌) వేశారు. కానీ సిట్‌ ఎలా తయారైందంటే ప్రభుత్వ పెద్దలు సిట్‌ అంటే సిట్‌...æ స్టాండ్‌ అంటే స్టాండ్‌గా తయారైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిస్పాక్షికంగా విచారణ జరపకుండా తూతూ మంత్రంగా విచారణ జరపాలనే ఉద్దేశ్యంతో సిట్‌ను నియమించారని తెలిసింది. గతంలో ఇలాంటి సిట్‌ విచారణను ఎ్రరచందనం, విజయవాడ మద్యం మరణాలపై కూడా వేయడం జరిగింది. కానీ ఏం ఫలితం వచ్చింది. సిట్‌ వల్ల పెద్ద ప్రయోజనం లేదు. నిజానికి నిజమైన దోషులను వెలికి తీయాలంటే సిట్‌ కాదు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు (సీబీఐ) అప్పగించాలని మా పార్టీ డిమాండ్‌. 

రెండో సారి మాట మార్చిన కలెక్టర్‌
స్వయాన జిల్లా కలెక్టర్‌ మొదటిసారిగా ఈ విషయాన్ని ప్రస్తావించినప్పడు లక్ష ఎకరాలకుపైగా రికార్డులు ట్యాంపరింగ్‌ కావడం జరిగిందని ఆయనే స్వయంగా ఒప్పుకొని, తరువాత రాజకీయ  ప్రముఖుల ప్రమేయంతో ఇలాంటి కుంభకోణం లేదు. 244 ఎకరాల భూమికి సంబంధించి ట్యాంపరింగ్‌ జరిగిందని మాట మార్చడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం.. గతంలో ఒకసారి డీజీపీ ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పారు. ఒక పోలీస్‌ అధికారితో ఈ విషయంలో దర్యాప్తు పూర్తి కాకుండా విచారణ కలగజేసుకోవడం. ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలపైనే ఆరోపణలు ఉన్నాయి. వారి ఇన్వాల్‌మెంట్‌ ఉన్నప్పుడు సిట్‌ను నియమించడం ఆమోదయోగ్యం కాదు. ఇది సీబీఐకి అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అప్పుడే ప్రజలు కూడా విశ్వసిస్తారు. 

అన్ని జిల్లాలకు ఆ చదలు పడుతుంది...
మనం భూమిని భూమాత అంటాం.. గౌరవిస్తాం.. మానవాళి మనుగడకు భూమి, నీరు చాలా అవసరం. అప్పుడప్పుడు భూమికి చదలు పడుతుంటుంది. పట్టిన చదలును వదిలేస్తే అది అలాగే  వ్యాప్తి చెందుంతుంది. మనం అందరం కలిసికట్టుగా ఉద్యమించకపోయినట్లయితే టీడీపీ నాయకుల మూలంగా విశాఖకు పట్టిన చెదలును నిర్మూలించకపోతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలో చదలు పట్టి విస్తరిస్తాయి. 

ఇవన్నీ మంత్రికి తెలియకుండానే జరుగుతాయా..?
కాశీవిశ్వేశ్వరస్వామి భూముల గురించి అందరికీ తెలుసు. గంగసాని అగ్రహారం పద్మనాభమండలంలో ఇంచుమించుగా 102 ఎకరాలను సర్వే నంబర్‌ 3–1, 3–2, 3–3, 3–4లో ఉన్న భూములను కబ్జా చేసే ఉద్దేశ్యంతో ఆర్డీఓపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఇది ఇంకా పూర్తి కాలేదు. దీనిపై మనం జాగ్రత్తపడాలి. ఈ విషయంలో జిల్లా మంత్రి, భీమిలి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అల్లుడు ప్రశాంత్‌కు భాగస్వామ్యం ఉంది. మంత్రికి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా.. అని ప్రశ్నిస్తున్నాను. ఇలాగే నీలయం సత్రం భూములకు సంబంధించి 444 ఎకరాలు. గతంలో 16 వందల మంది రైతులకు భూములు కేటాయించడం జరిగింది. ఈ 16 వందల రైతుల నుంచి ప్రశాంత్‌ అనే వ్యక్తి ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో ఎకరా రూ. 10 లక్షలు విలువ చేసే భూమిని రూ. లక్షకే తీసుకొని భూకబ్జాలకు పాల్పడుతున్నాడు. 

ఉద్దేశ్యపూర్వకంగానే స్కూల్స్‌ మూసివేత..
ఇదంతా ఒక ఎత్తు అయితే రాష్ట్ర విద్యాశాఖమంత్రిగా నారాయణ గతంలో పనిచేశారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఎంవీఎస్‌ మూర్తి తెలుగుదేశం శాసనమండలి సభ్యులు. ఒక ప్రణాళిక బద్ధంగా ఆంధ్రరాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి, అన్నింటినీ ప్రైవేట్‌ పరం చేయాలి. ప్రైవేట్‌ యూనివర్సిటీలు నిర్మించాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడమా.. లేక ప్రైవేట్‌ పరం చేయడమా అనే దురుద్దేశంతో స్వయాన నారాయణే విద్యా అనే దాన్ని వ్యాపారంగా చూసుకుంటూ, మూర్తి చైతన్య ఇనిస్టిట్యూషన్స్, గీతం యూనివర్సిటీకి చెందిన విద్యాసంస్థలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీలో ఒక భాగంగా వారి కనుసన్నల్లో జరుగుతుంది.
ఈ విషయాన్ని నేను పార్లమెంట్‌లో లేవనెత్తాను. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి  ఉన్నప్పుడు ప్రతీ గ్రామానికి స్కూల్‌ ఉండాలి. అందరూ విద్యనభ్యసించాలనే మంచి ఉద్దేశ్యంతో ప్రభుత్వ స్కూల్స్‌ ఏర్పాటు చేశారు. కానీ ఈ రోజు దానికి పూర్తి భిన్నంగా చంద్రబాబు క్లస్టరైజేషన్‌ ఆఫ్‌ స్కూల్స్‌ పేరుతో ప్రతి పది కిలోమీటర్లకు ఒక స్కూల్‌ చాలు అని మిగిలిన స్కూల్స్‌ మూసేసి, పది కిలోమీటర్ల ఒక స్కూల్‌ను ఉంచడం జరుగుతుంది. 

ఒక విద్యార్థి పది కిలోమీటర్లు ప్రయాణం చేసి తరగతులు ముగించుకొని తిరిగి పది కిలోమీటర్ల వారి గ్రామానికి వెళ్లాలంటే తల్లిదండ్రులకు ఎంత భయంగా ఉంటుంది. ట్రావెలింగ్‌ ఖర్చులు ఎవరు భరిస్తారు. ఎంత ఖర్చుతో కూడిన పని అని పార్లమెంట్‌లో ప్రశ్నించనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మేం ఏ స్కూల్‌ను మూసేయడం లేదు. దీనికి వెనుక టీడీపీ నాయకులు, మంత్రులున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే స్కూల్స్‌ను మేసేయడం జరుగుతుంది. 

ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ స్కూల్స్‌ను నిర్వీర్యం చేయోచ్చు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మా నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తప్పకుండా ఏదైతే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసి విద్యను ప్రైవేట్‌ పరం చేస్తున్నారో వాటన్నంటినీ, తిరిగి స్టేటస్‌కో యాంటీ అంటే ప్రభుత్వ స్కూల్స్‌లో క్వాలిటీ ఎడ్యూకేషన్‌ను ఇంప్రూమెంట్‌ చేసి ప్రైవేట్‌ స్కూల్స్‌తో సమానంగా ప్రభుత్వ స్కూల్స్‌ను తీసుకొస్తామని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా..

గీతం యూనివర్సిటీ స్థలం అసైన్డ్‌ భూమి...
ఎంవీఎస్‌ మూర్తి ఆంధ్రయూనివర్సిటీ ఒక దెయ్యాల కొంప అని మాట్లాడారు. ఆయన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోండి.. ప్రభుత్వ యూనివర్సిటీలు పనికిరావు, గీతం లాంటి ప్రైవేట్‌ యూనివర్సిటీలను నిలబెట్టాలనే దురుద్ధేశం కనిపిస్తోంది. ఇంకో విషయాన్ని ఈయన గురించి చెప్పాలంటే మొట్టమొదటగా గీతం యూనివర్సిటీకి ఒక సెంట్‌ భూమి కూడా లేదు. ఈ రోజు 86 ఎకరాల్లో గీతం యూనివర్సిటీ ఉంది. మొదటి నుంచి రికార్డులు పరిశీలిస్తే ఇవన్నీ అసైన్డ్‌ భూములు. ఆ రోజు రైతుల దగ్గర ఇవన్నీ కొనుగోలు చేసి చట్టప్రకారం వాటిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయించి ఈయన విద్యాసంస్థలకు అలాట్‌ చేయించుకున్నారు. 86 ఎకరాలే కాకుండా దాని పక్కనే ఉన్న 54 ఎకరాల భూమిని కూడా కబ్జా చేసేందుకు స్టేజీని నియమించుకున్నారు. ఆయన ఆక్రమణలోకి తీసుకొని భూకబ్జా చేసి పక్కన భూమిని కూడా తన ఆదీనంలోకి తీసుకొని, గతంలో 54 ఎకరాలు రాజీవ్‌ స్వగృహాకి, ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీకి, మరికొన్ని ప్రభుత్వ సంస్థలకు అన్నింటికీ భూమిని అలాట్‌ చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం జీవో ద్వారా వాటిని రద్దు చేసి మూర్తికి ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. భూఆక్రమణలకు పాల్పడొచ్చు.. కానీ 2019 తరువాత చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినవారందరినీ కూడా చట్ట ప్రకారం.. చట్ట పరిధిలోకి తీసుకొచ్చి ఆ భూములను వెనక్కు తీసుకొని నిజమైన యజమానులకు అప్పగిస్తామని చెబుతున్నా..

వీరంతా జైలుకెళ్లక తప్పుదు...
ఈరకంగా విశాఖపట్నం జిల్లాలోనే గతంలో చెప్పినట్లుగా లక్ష ఎకరాల భూమిని ఎవరైతే స్వయాన ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్, గంటా శ్రీనివాసరావు, గంటా బావమరిది పరుచూరి భాస్కర్‌రావు, అల్లుడు ప్రశాంత్, ఎమ్మెల్యేల విషయానికొస్తే వెలగపూడి రామకృష్ణ, అనకాపల్లి గోవింద్, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఆయన కుమారుడు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్, పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత అందరి ఇన్వాల్వ్‌మెంట్‌ ఉంది. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారో.. మీరందరూ జైలుకు పోవాల్సిన రోజు వస్తుందని తెలియజేస్తున్నా.. ప్రజా ఉపయోగకర కార్యక్రమాలకు వినియోగిస్తే పర్వాలేదు. ధనార్జనే ధ్యేయంగా చేస్తున్న ఈ పనులు గర్హనీయం, వీటన్నింటినీ వెలికి తీసి విచారణ జరిపిస్తాం.. న్యాయం చేస్తాం.

తాజా వీడియోలు

Back to Top