విశాఖ చుట్టూ పచ్చ గద్దలు

విశాఖపట్నం) విశాఖ
నగరం చుట్టూ తెలుగుదేశం పచ్చ నాయకుల కళ్లు పడ్డాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ
సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో
ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే ముంబై తరువాత ఆ తరహాలో పురోగమిస్తున్న నగరం
విశాఖ అని బొత్స అభివర్ణించారు. ఇంతటి పురోగతి ఉంది కాబట్టే తెలుగుదేశం నాయకులు,
ముఖ్యంగా లోకేష్ కన్ను ఇక్కడ పడిందని ఆయన అన్నారు. అటు వెంకయ్య నాయుడు వంటి బీజేపీ
నేతల కన్ను కూడా పడిందని గుర్తు చేశారు. బ్రహ్మ సమాజం భూములు అన్యాక్రాంతం
కాకూడదని, పేదల కోసం ఉపయోగ పడాలని నిర్దేశించిన భూములు అని బొత్స వెల్లడించారు.
కానీ వాటిని దురాక్రమణ చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆయన
పేర్కొన్నారు. 

Back to Top