బాబు పాలనలో మహిళలకు రక్షణ కరువు


తూర్పు గోదావరి: చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని స్థానికులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొద్ది సేపటి క్రితం కాకినాడ నగరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు వైయస్‌ జగన్‌ మాస్క్‌లు ధరించి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం మహిళలు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. రాజన్న రాజ్యంతోనే తమకు మేలు అని మహిళలు అభిప్రాయపడ్డారు. జాబు వస్తే జాబు వస్తుందని ఆ రోజు ఓట్లు వేయించుకొని మోసం చేశారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే మహిళలకు భద్రత, రక్షణ దొరుకుతుందని పేర్కొన్నారు. నవరత్నాలతో మా అందరికి మంచి జరుగుతుందన్నారు. వైయస్‌ జగన్‌ తమ కోసం పోరాడే శక్తి అని మహిళలు పేర్కొన్నారు.
 
Back to Top