రాజీనామాలపై కోర్టుకెడతాం: వైయస్ఆర్ కాంగ్రెస్

హైదరాబాద్ 18 అక్టోబర్ 2013: రాష్ట్ర విభజనకు నిరసనగా తాను స్పీకర్ ఫార్మాట్లో సమర్పించిన  రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ నుంచి సమాచారం అందినట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై తాము న్యాయ స్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. తనతో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి రాజీనామాలను ఆమోదింపజేసుకునేందుకు కోర్టుకు వెడతామని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.

Back to Top