బీసీల అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నాం

  • రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా అభివృద్ధి పరిచేది వైయస్‌ జగన్‌ ఒక్కరే
  • ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకుంటాం
  • చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలపై ప్రజలను చైతన్యపరుస్తాం
  • రాజన్న సువర్ణ పాలన జగనన్న తీసుకువస్తారు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి
విజయవాడ: 2019లో అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పర్చాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. రాబోయే కాలంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ విధంగా కార్యచరణ రూపొందించుకోవాలి. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలనే అంశాలపై వైయస్‌ జగన్‌ పార్టీ బీసీ నేతలతో చర్చించారని చెప్పారు. ఈ మేరకు జంగా కృష్ణమూర్తి విజయవాడ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు వందల కొద్ది వాగ్ధానాలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయని మోసకారి చంద్రబాబు ప్రభుత్వ పథకాలపై కూడా చర్చించామన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో పర్యటించి ప్రజల స్థితిగతులు, సమస్యలు తెలుసుకోనున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వాకాన్ని, మోసపూరిత వాగ్ధానాలు చేసి ఏ విధంగా బీసీలను ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకుందో ప్రజలకే వివరించి వారిని చైతన్యవంతులను చేస్తామన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ బీసీ నేతలంతా క్షేత్రస్థాయిలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని క్రోడీకరించాలని వైయస్‌ జగన్‌ సూచించారని చెప్పారు. వైయస్‌ జగన్‌ చేపట్టే పాదయాత్రలో ప్రజలు ఇచ్చే రిప్రజెంటేషన్స్‌ తీసుకొని వీటన్నింటిపై పాదయాత్ర అనంతరం బీసీ గర్జన ఏర్పాటు చేస్తామన్నారు. గర్జనలో వైయస్‌ జగన్‌ బీసీలకు న్యాయం జరిగే విధంగా డిక్లరేషన్‌ ఇవ్వనున్నారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన సువర్ణ పరిపాలనను వైయస్‌ జగన్‌ తీసుకువస్తారన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top