మ‌హానేత‌కు ఘ‌న నివాళి

అనంత‌పురం:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి ప‌శ్చిమ రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీగా గెలుపొందిన వెన్న‌పూస గోపాల్‌రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌పురం ప‌ట్ట‌ణంలోని పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి స‌ప్త‌గిరి స‌ర్కిల్ వ‌ర‌కు  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ విజ‌యోత్స‌వ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన కూడ‌లిలో ఏర్పాటు చేసిన మ‌హానేత విగ్ర‌హానికి గోపాల్‌రెడ్డి, పార్టీ నాయ‌కులు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఇది ప్ర‌జా విజ‌య‌మ‌ని, ప్ర‌జాక్షేత్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ధీమా వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు హామీల‌తో మోస‌పోయిన నిరుద్యోగులు టీడీపీకి గుణ‌పాఠం చెప్పార‌ని గోపాల్‌రెడ్డి అన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోరాటాలే త‌న గెలుపున‌కు మ‌లుపు అని వ్యాఖ్యానించారు.

Back to Top